Friday, April 3, 2026

ఘనంగా సిపిఐ శతాబ్ది ఉత్సవాలు

- Advertisment -

నేటి వారిది న్యూస్

భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మణుగూరు మండలం రామానుజవరం గ్రామంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్మారక స్థూపాన్ని ఆవిష్కరించి మణుగూరు ప్రధాన రహదారిపై ఎర్ర జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ తెలంగాణలో 5000 ప్రాంతాల్లో ఈరోజు ఎర్రజెండా ఆవిష్కరణ చేశామన్నారు,100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీలో మేమందరం ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది.అన్ని రంగాలలో ఏ పార్టీకి లేనంత సంఖ్యాబలం సిపిఐ అనుబంధ సంస్థ ఏఐటీయూసీ కి ఉందన్నారు.వందేళ్లు భారతదేశంలో ఒక పార్టీ మనుగుడా అనేది చిన్న విషయం కాదని,సిపిఐ తో పాటు ఆర్ఎస్ఎస్ కూడా వందేళ్ల చరిత్ర ఉన్న స్వతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర లేదన్నారు.మతమే జండాగా పెట్టుకొని దాని ద్వారా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి మతాన్ని చెప్పకుండా ఆర్ఎస్ఎస్ ద్వారా బిజెపి మత రాజకీయాలు చేసి అధికారంలో ఉండేందుకు దుష్టపన్నాగాలు పన్నుతుందన్నారు.మిగతా పార్టీలన్నీ కూడా భూస్వాములకు,కార్పొరేట్ సంస్థలకు మద్దతు తెలుపుతూ రాజకీయాలు సాగించే పార్టీలే అని వీటన్నిటికీ భిన్నంగా పుట్టిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని బడుగు బలహీన వర్గాల కోసం,పేదవాడి హక్కుల కోసం పోరాటం చేసే ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ అన్నారు..

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -