Friday, April 3, 2026

ప్రజల సౌకర్యార్థం ఎన్ఎస్పీ కెనాల్ పై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి

- Advertisment -

నేటివారధి న్యూస్
ఖమ్మం నగరం రోజురోజుకు అభివృద్ధి అవుతున్నది విస్తరణలో కూడా అభివృద్ధి చెందుతున్నది గ్రామీణ ప్రాంతాల నుండి చిరు వ్యాపారం చేసుకోవడానికి పిల్లల చదువుల నిమిత్తం ఖమ్మం నగరం వచ్చి జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి నేడు ఖమ్మం నగరంలో ఉన్నది ఖమ్మం 1వ డివిజన్ కైకొండే గూడెం రాజీవ్ నగర్ గుట్ట మంచిగంటి నగర్ యూపీహెచ్ కాలనీకి మరియు వికలాంగుల కాలనీ మధ్యగా ఉన్నటువంటి ఎన్ఎస్పీకే నేలపైన బ్రిడ్జి నిర్మాణం చేపడితే ప్రజలు ఖమ్మం నగరానికి రవాణా సౌకర్యం తక్కువ దూరంలో ఉంటుంది వివిధ పనుల కోసం ఖమ్మం వచ్చే వారికి చార్జీలు కూడా తగ్గే అవకాశం ఉంటది కాబట్టి తక్షణమే ఖమ్మం నగరపాలక కమిషన్ గారు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని
ఈరోజు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం వన్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో కమిషనర్ గారికి మెమోరడం ఇవ్వడం జరిగింది అనంతరం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం డివిజన్ కార్యదర్శి టి ఝాన్సీ పార్టీ జిల్లా నాయకులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ప్రజలకు ప్రయాణం తగ్గించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వికలాంగుల కాలనీకి రాజీవ్ నగర్ గుట్టకు మధ్య ఉన్న ఎన్ఎస్పి కెనాల్ పైన బ్రిడ్జి నిర్మాణం చేపడితే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని వారన్నారు
ఈ వినతి పత్రం కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు సిహెచ్ శిరోమణి ఆవులు మంగతాయి శోభ మరియు పార్టీ వన్ టౌన్ కమిటీ కార్యదర్శి జాలాది లెనిన్ ములకలపల్లి లక్ష్మీనారాయణ సిద్ధిరాల నాగయ్య జక్కుల భరత్ బొమ్మకంట రమేష్ తదితరులు పాల్గొన్నారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -