Friday, April 3, 2026

తిరుపతి తోపులాటలో భక్తుల మృతిపై సీఎం చంద్రబాబు దిగ్ర్భాంతి.

- Advertisment -

నేటి వారధి న్యూస్
AP తిరుపతి దుర్ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్న ముఖ్యమంత్రి.
గాయాలైన వారికి అందుతున్న చికిత్స పై అధికారులతో మాట్లాడిన సిఎం చంద్రబాబు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సిఎం ఆదేశాలు. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటపై సిఎం సమీక్ష.
డీజీపీ, టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో రివ్యూ చేసిన సిఎం చంద్రబాబు
దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరమన్న సిఎం చంద్రబాబు
విశాఖలో మంచి కార్యక్రమం పూర్తి చేసుకున్న సమయంలో తిరుపతిలో జరిగిన ఈ ఘటన తనకు తీవ్ర బాధను కలిగించిందన్న సిఎం
ముందు జాగ్రత్త చర్యలు విఫలం కావడంపై అధికారుల మీద తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.
భక్తులు అధికంగా వస్తారని తెలిసినప్పుడు…అందుకు అనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారని ప్రశ్నించిన సిఎం
ఇలాంటి చోట్ల విధుల్లో అత్యంత అప్రమత్తంగా, బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించిన ముఖ్యమంత్రి.
మృతుల సంఖ్య పెరగడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.
ప్రస్తుతం క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై వివరించిన జిల్లా అధికారులు.
మృతుల సంఖ్య పెరగకుండా బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు సిఎం ఆదేశం
టీటీడీ టోకెన్లు ఇచ్చే కౌంటర్ల నిర్వహణ, భద్రతను పున:సమీక్షించాలన్న సిఎం
తిరుపతికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.*l

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -