Friday, April 3, 2026

డోర్నకల్ పట్టణంలో డ్వాక్రా అధికారుల డాక్యుమెంటేషన్ మాయజలం

- Advertisment -

నేటి వారధి న్యూస్ డీఎంసీ,ఇంచార్జు అర్పీ కనుసన్నలోనే…బ్యాంకు సోమ్మకు కన్నం
అన్ని పసిగట్టే బ్యాంకు అధికారులకు ఈ మొసం కనిపించలేదా
బడానేతల కుటుంబ సభ్యులు ఉన్నారని భయమా…మోసంలో ఎవరి పాత్ర ఎంతో తేలాలి.
బ్యాంకు అధికారుల పాత్రపై సిబిఐకి పిర్యాదు… తీగా డొంక కదలాలి.
అమెరికాలో ఉన్న ఆమె పొదుపు సంఘానికి 20 లక్షలు జమ… మాయం చేద్దాం అనుకుంటుండగా బయట పడ్డ దొంగలు
పిర్యాదు చేసిన వ్యక్తి మీద బడా లీడర్ అక్కసు… ఆమెపై నిందారోపణలు.
డోర్నకల్ మున్సీపాలిటీ పరిదిలోని వెలుగు గ్రామ సమఖ్య సంఘంలో పొదుపు సంఘాల పర్యవేక్షణ చేసే అధికారులే లేని మనిషిని ఉన్నట్టు చూపించి 20 లక్షలు బొక్క పెట్టారు.
డోర్నకల్ పట్టణంలో గత 3 సంవత్సరాలుగా ఇంచార్జు ఆర్పీ పర్యవేక్షణలో నడుస్తున్న ఆదర్శ గ్రూప్ పొదుపు సంఘానికి ఈ మద్య కాలంలో కొత్తగా ఋణం మంజూరు చేసే క్రమంలో గ్రూప్ మొదటి లీడర్ గత 3నెలలుగా విదేశాలలో ఉండగా వారీ గ్రూప్ నకు 20లక్షల రూపాయలు ఋణం మంజూరు చేసి గ్రూప్ సభ్యుల ఉమ్మడి బ్యాంకు ఖాతాకు బదిలీ చేయడంతో పలు అనుమానాలు తావిస్తున్నాయి.
అసలు డ్వాక్రా ఋణం మంజూరు ఎలా.
డ్వాక్రా మహిళ పొదుపు సభ్యులకు ఋణం మంజూరు చేయలంటే గ్రూప్ మొదటి లీడర్, రెండవ లీడర్ విధిగా అందుబాటులో ఉండాలి వారి సంతకాలతో ఒక డాక్యుమెంట్ తయారు చేసిన తర్వాత అర్పీల పై అదికారి మేప్మా డీఎంసీ, ఆర్పీ తెచ్చిన డాక్యుమెంట్ విచారణ చేసి సంతకాలు మొదటి, రెండవ లీడర్ ల సరిచూసిన తర్వాత చివరి విచారణ తరువాత ధ్రువీకరించి సంతకం పెట్టి బ్యాంకు అధికారులకు సమర్పిస్తే బ్యాంకు వారు డాక్యుమెంట్ పై విచారణ చేసి మొదటి, రెండవ లీడర్ వారి ముందు హాజరైన తర్వాత సంతకాలు తీసుకోని ఋణం మంజూరికి దృవీకరించాల్సి ఉంటుంది. ఇంతా తతంగం ఉన్నా ఆర్పీ తీసుకెళ్ళిన డాక్యుమెంట్ ని మేప్మా డీఎంసీ, బ్యాంకు అధికారులు కాని గుర్తించకుండా గుడ్డి గాడిదకు పళ్లు తోమినేట్లు ఋణం మంజూరు చేసి ఆదర్శ పొదుపు గ్రూప్ అకౌంట్ లో వేశారు.
అందరికి కనుసన్నలోనే ఈ మాయాజలం
విదేశాలకు వెళ్ళిన గ్రూప్ లీడర్ లేకుండా ఆ గ్రూప్ నకు ఋణం మంజూరు ఎలా చేస్తారని డోర్నకల్ యాదవ్ నగర్ కు చెందిన ఎండీ.సలీమా అనే మహిళ సభ్యురాలు గుర్తించి బ్యాంకు అధికారులకు సమాచార హక్కుచట్టం క్రింద దరఖాస్తు చేసి, మేప్మా జిల్లా అధికారుల పిర్యాదు చేసింది. పిర్యాదు చేసిన ఈ మహిళపై ఆ గ్రూపులో ఉన్న రాజకీయ నేతల భర్తలు బెదిరింపులకు దిగుతున్నట్లు ఆ మహిళా చెబుతుంది. ఈ విషయంలో బాద్యులైన మెప్మా, బ్యాంకు అధికారులపై విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని ఆమె జిల్లా కలెక్టర్, ఎస్పీ, సిబిఐ అధికారులను కోరుతుంది.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -