Saturday, April 4, 2026

ఆరు గ్యారెంటీల అమలుకై చలో హైదరాబాద్ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కారేపల్లి మండల కార్యదర్శి వై ప్రకాష్

- Advertisment -

నేటి వారధి న్యూస్
ఖమ్మం.కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను 420 హామీలను నెరవేర్చాలని ఈనెల 20 తారీఖున చలో హైదరాబాద్ మహా ప్రదర్శన సభను జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు కారేపల్లి మండలం వేరుపల్లి జవాన్ల పెళ్లి గ్రామాలలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వై ప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు కావస్తున్న వివిధ రకాల సర్వేలకే పరిమితమైందని ఎన్నికలకు ముందు ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను 420 హామీలను ఇంతవరకు ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని రైతులకు రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా ఇండ్లు లేని పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు రేషన్ కార్డులు పోడు భూములకు పట్టాలు కౌలు రైతులకు రైతులందరికీ ఎకరానికి 15 వేల రూపాయలు వ్యవసాయ కూలీలకు ఏటా 12 వేల రూపాయలు కింటాకు 500 రూపాయల బోనస్ చేయూత పథకం కింద నెలకు 4000 రూపాయల పెన్షన్ వివిధ రకాల పింఛన్లు కనీస వేతనం చట్టం అమలు చేయడంలో వంటలకు గిట్టుబాటు ధర ఇవ్వడంలో యువతకు ఏటా రెండు లక్షల ఉద్యోగాలు విద్య వైద్యం వివిధ రకాల వాగ్దానాలను హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దీని మూలంగా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని దీనిని ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాలని దీని అమలుకై ఈనెల 20 తారీకున హైదరాబాదులో జరుగు మహా ప్రదర్శనను సభను అన్ని వర్గాల ప్రజలు వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల నాయకులు కంచర్ల శ్రీనివాస్ రెడ్డి అలెం చంద్రయ్య బుర్ర కోటమ్మ సుగుణ పద్మ లక్ష్మి సరోజ తదితరులు పాల్గొన్నారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -