నేటి వారధి న్యూస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి 15 వ వార్డు కౌన్సిలర్ భర్త నాగవెల్లి రాజలింగమూర్తిని గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి హత్య చేశారు మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగు బాటు పై కేసీఆర్ మాజీ మంత్రులతో పాటు గుత్తేదారు కంపెనీలపై రాజలింగమూర్తి కేసు నమోదు చేసి వెలుగులోకి వచ్చాడు గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను పట్టణంలోని రెడ్డి కాలనీలో అదును చూసి కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు మూర్తి కొద్దిసేపు మృత్యువుతో పోరాడి తనువు చాలించాడు ఇది రాజకీయ హత్యనా లేక మరేదైనా కారణాలతో నా అనేది తెలియాల్సి ఉంది పాత కక్షలు భు తగాదాలే హత్యకు ప్రధాన కారణమని స్థానికులు అంటున్నారు కాలేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టులో అవకతవకల కు సంబంధించి కెసిఆర్ హరీష్ రావు ఇతరులపై ఎస్ ఐ ఆర్ నమోదు చేయాలని కోరుతూ భూపాలపల్లి జిల్లా కోర్టులో రాజలింగమూర్తి పిటిషన్ వేశారు ఈ విచారణ ను కొనసాగించే స్టేను తెలంగాణ హైకోర్టు పొడిగించింది ఈ అంశంపై ఫిబ్రవరి 20న విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించింది ఒకరోజు ముందే హత్య జరగడం కలకలం రేపింది. రోడ్డుపై విగత జీవుడుగా పడి ఉన్న రాజా లింగమూర్తిని చికిత్స కోసం హుటా హుటిన పోలీసులు ఆసుపత్రికి తరలించారు అక్కడే గురువారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు భూపాలపల్లి డి.ఎస్.పి సంపత్ కుమార్ తెలిపారు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు తెలిపారు హత్యకు భూ వివాదాలే కారణం కావచ్చునని ఐదుగురుపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు పలువురుని అదుపులోకి తీసుకున్నట్లు డి.ఎస్.పి వివరించారు
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దారుణ హత్య
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

