Saturday, April 4, 2026

ప్రజలను కొల్లగొట్టి కార్పొరేట్లకు లాభాలు చేకూర్చే విధంగా కేంద్ర బడ్జెట్ – ఆర్థిక విశ్లేషకుడు డాక్టర్ పాపారావు

- Advertisment -

నేటి వారధి న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాచలం,కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలపై అదనపు పన్నుల భారాన్ని మోపుతూ, కార్పొరేట్లకు లాభాల కోసం మద్దతుగా ఉందని ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు డాక్టర్ పాపారావు పేర్కొన్నారు. ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సీఐటీయూ పట్టణ కన్వీనర్ ఎం.బి. నర్సారెడ్డి అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన ముఖ్య వక్తగా మాట్లాడారు.
ఈ సందర్భంగా డాక్టర్ పాపారావు మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్ పూర్తిగా సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ విధానాలకు ఊతమివ్వడం ద్వారా కార్మికులు, రైతులు, మధ్య తరగతి, పేద ప్రజల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా పారిశ్రామిక ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోగా, నిరుద్యోగం పెరిగిపోయిందని, దేశవ్యాప్తంగా పేదరికం, అసమానతలు తీవ్రమయ్యాయని వ్యాఖ్యానించారు.
ఈ బడ్జెట్ కొద్దిమంది ఆదాయపు పన్ను (ఇన్‌కమ్ ట్యాక్స్) కడుతున్న వారికి మాత్రమే ప్రయోజనం కలిగించేలా ఉండి, మిగతా దేశ ప్రజలకు పూర్తి వ్యతిరేకంగా ఉందని డాక్టర్ పాపారావు అన్నారు.
ఇక కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యలను బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం గమనార్హమని చెప్పారు. రైతులకు కనీస మద్దతు ధర (MSP) గ్యారెంటీ చేసే చట్టంపై చర్చ జరగకపోవడం, ఉపాధి హామీ చట్టానికి (MGNREGA) నిధులు తగ్గించడం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగినప్పుడే పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుందని, కానీ కార్పొరేట్లకు మాత్రమే రాయితీలు కల్పించడం వల్ల ఉత్పత్తి పెరిగే పరిస్థితి కాదని వివరించారు.కార్మికులు, రైతులు, పేద ప్రజలు కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని డాక్టర్ పాపారావు పిలుపునిచ్చారు.
ఈ సదస్సులో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె. బ్రహ్మచారి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎలమంచి వంశీకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గడ్డం స్వామి, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు నాదెళ్ల లీలావతి, గిరిజన సంఘం పట్టణ కార్యదర్శి కుంజా శ్రీనివాస్, కెవిపిఎస్ జిల్లా నాయకుడు కోరాడ శ్రీనివాస్, డివైఎఫ్ఐ నాయకుడు పి. సంతోష్ కుమార్, సీపీఎం సీనియర్ నాయకులు జి.ఎస్. శంకర్రావు, బి.బి.జి. తిలక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -