నేటి వారధి న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాచలం పట్టణంలోని గోల్డ్ స్మిత్ కాలనీలో మహాజన మహిళా సమైక్య ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మహాజన మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు మేకల లత మాట్లాడుతూ, వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి ఎదురుగా ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ భవన్ (ఎస్సీ కమ్యూనిటీ హాల్) నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు.
ఆయన వ్యాఖ్యానిస్తూ, సంవత్సరాలుగా అంబేడ్కర్ భవన్ నిర్మాణ పనులు జాప్యానికి గురవుతున్నాయి. ప్రభుత్వాలు, మంత్రులు, కలెక్టర్లు మారినా ఈ భవన నిర్మాణానికి గతి పడడం లేదు. వందలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద ప్రజలకు ఉపయోగపడే ఈ భవన నిర్మాణం ఇంకా పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాకపోవడం దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి నాటికి భవన నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు తగిన చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మహాజన మహిళా సమైక్య జిల్లా ఉపాధ్యక్షురాలు కొచ్చర్ల కుమారి మహిళా సమైక్య జిల్లా ఉపాధ్యక్షురాలు గద్దల కృష్ణవేణి కొప్పుల నాగమణి తదితరులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ భవన్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలి – మేకల లత
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

