నేటి వారధి న్యూస్( ప్రతినిధి)
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం గౌరారం గ్రామంలో ప్రతి ఏటా హనుమాన్ మందిరం వద్ద అఖండ హరినామ సప్త కార్యక్రమం మాడ పోచయ్య మహారాజ్ ఆధ్వర్యంలో ఏడు రోజులపాటు అఖండ హరినామ సప్త కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తారు. ఈ సప్త కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి మహారాజులు పాల్గొంటారు. మరియు గ్రామ ప్రజలు పెద్దలు మహిళలు చిన్నలు వివిధ గ్రామాల భక్తులు పాల్గొని భగవంతుని నామస్మరణతో భజన కార్యక్రమం ప్రవచనాలు ఆలకిస్తూ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మహిళలు ప్రతిరోజు ఏడు రోజులపాటు ఇంటినీ శుద్ధం సాన్పు అలుకూత చేసుకుని ప్రతిరోజు నియమంతో ఉంటారు. 25వ తారీకు నుండి నాలుగో తారీఖు వరకు సప్త కార్యక్రమం కొనసాగును ఆఖరి రోజు గోపాల కాలువలు ఊరు అందరూ కలిసి నిండు బిందెలతో కొత్త బట్టలు ధరించి భగవంతుని నామస్మరణ ప్రవచనాలు ఆలకిస్తు ఊర్లో ఊరేగింపు చేసి హనుమాన్ మందిరం వద్ద ఆధ్యాత్మిక చింతన భవంతుని విషయాలు ప్రవచనాలు తెలియజేస్తారు. అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు హనుమంతరావు పటేల్ గ్రామ కమిటీ భజన మండలి కొండ్రవిటల్ మాజీ సర్పంచ్ అనసూయ శంకర్ బైరి లక్ష్మా గౌడ్ కుమ్మరి రమేష్ కుమ్మరి అంజయ్య శంకర్ రేంజర్ల సాయిలు గొల్లవిటల్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
గౌరారంలో అఖండ హరినామ సప్త ఐదోవ వార్షికోత్సవం
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

