Friday, April 3, 2026

ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో ఎల్ల వేళల అందుబాటులో ఉండాలి  జడ్పీ వైస్ చైర్మన్ బాలయ్య

- Advertisment -

నేటి వారధి న్యూస్
కడప నగరం కాగితాల పంటలలో ఆంధ్రప్రదేశ్ బహు జన సంక్షేమ సంఘం కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా జడ్పీ వైస్ చైర్మన్ బాలయ్య హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అందెల బాల ఓబయ్య ఎల్లవేళలా ప్రజాసేవలో ఉండాలని, అలాగే ప్రజల సమస్యలపై పోరాడుతూ అండగా ఉండాలని కోరారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు అందెల బాల ఓబయ్య మాట్లాడుతూ ప్రజల సమస్యలను ప్రభుత్వ అధికారులు దృష్టికి అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల దగ్గరికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని బహుజన సంక్షేమ కార్యాలయం ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని కడప నగరంలో ప్రారంభించామని తెలిపారు. మా బహుజన సంక్షేమ నేను, మా కార్యకర్తలు ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా ఆఫీసులో అందుబాటులో ఉంటామని అన్నారు. అలాగే 2018 సెప్టెంబర్ 14న రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన పెరుమాళ్ళ ప్రణయ్ పరువు హత్య కేసులో నల్గొండ జిల్లా ఎస్సీ ఎస్టీ రెండో అదనపు కొట్టు ఎ టు సుభాష్ శర్మకు ఉరిశిక్ష, మిగిలిన వారికి జీవిత ఖైదు ఊదించడం పట్ల బహుజన సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది ఈ కోర్టు తీర్పు మరొకసారి పరువు హత్య చేస్తే ఎంతటి వారైనా శిక్ష తప్పదని అలాగే చట్టం ముందు అందరూ సమానమే అని విశ్వాసం నమ్మకం కలిగిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు విజయ రాణి, ఎల్లటూరు ఎంపీటీసీ నాగమల్లారెడ్డి నల్లగారిపల్లె ధనుంజయ రెడ్డి నాగపల్లె సర్పంచ్ మల్లేష్ లారెన్స్ రామయ్య సూరి చీమలపెంట రాజన్న సుబ్బరాయుడు ప్రేమ్ కుమార్ సీమోను, తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -