Friday, April 3, 2026

మిషన్ పరివర్తన అవగాహన అంగన్వాడి సెంటర్ చిట్కుల్

- Advertisment -

నేటి వారధి న్యూస్
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చిట్కుల్ గ్రామములో మిషన్ పరివర్తన అవగాహన సదస్సు నిర్వహించారు మాదక ద్రవ్యాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కమ్యూనిటీ ఎడిటర్ లక్ష్మీప్రసన్న తెలియజేశారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడితే శరీరం మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వాటిని పగడ్బందీగా అరికట్టే బాధ్యతప్రతిఒకరిపై ఉందని సూచించారు. యువత మాదక ద్రవ్యాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఒకసారి వీటికి బానిసలు అయితే జీవితంలో కోలుకోవడం చాలా కష్టం అవుతుందని యువతకు వివరిస్తున్నారు. ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో స్పెషల్ రైలు నిర్వహిస్తున్నారు. ఒక్కసారి గంజాయి ఇతర మత్తు పదార్థాలు సేవిస్తే దాని ప్రభావం శరీరంలో ఆరు నెలల వరకు ఉంటుంది. తెలిసి తెలియక మొదటిసారిగా సేవించి పట్టుబడిన వారికి మిషన్ పరివర్తన కార్యక్రమం ద్వారా మారడానికి అవకాశం కల్పిస్తున్నారు. రెండవసారి మార్గద్రవ్యం సేవించి పట్టుబడితే ఆరు నెలల వరకు జైలు శిక్ష ఉంటుంది. ఒక్కసారి పట్టుబడి జైలుకు వెళ్తే జీవితంలో ప్రభుత్వం ప్రైవేటు ఉద్యోగాలకు అనర్హులు అవుతున్నారు. మార్గద్రవ్యాల క్రయవిక్రయాలు, వాటి వినియోగంపై ఉక్కు పాదం మోపుతున్నారు. ఎవరైనా మారకద్రవ్యాలు అమ్మిన సరఫరా చేసిన, సేవించినట్లు సమాచారం తెలిస్తే వెంటనే డాల్ 100 కు మరియు వాట్సాప్ నెంబర్ తెలియజేయాలి. తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కమ్యూనిటీ ఎడ్యుకేటర్ లక్ష్మీ ప్రసన్న తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ శ్యామల షహనాజ్ చంటి పిల్లల తల్లులు అంగన్వాడి విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -