Saturday, April 4, 2026

ఇసుక సమస్యపై బీఆర్ఎస్ నిరసన

- Advertisment -

నేటి వారధి న్యూస్
భద్రాచలం పట్టణంలో సామాన్యులకు ఇసుక అందుబాటులోకి రావాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) భద్రాచలం మండల కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.
మండల పార్టీ కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం అక్రమ ఇసుక రవాణాను అరికట్టడంలో విఫలమైందని, పేదలకు అవసరమైన ఇసుకను అందించకుండా అన్యాయం చేస్తోందని ఆరోపించారు. స్థానిక అవసరాలకు ఉచితంగా ఇసుక అందించేలా ప్రత్యేక జీవో తీసుకురావాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో కోటగిరి ప్రమోద్ కుమార్, రేపాక పూర్ణచంద్రరావు, కొల్లం జయ ప్రేమ కుమార్, అంబటి కర్ర కృష్ణ, అయినాలా రామకృష్ణ, తాండ్ర ప్రసాద్, దానియేలు ప్రదీప్, కొల్లిపాక శివ, రావూరి రవి కిరణ్, ఇమంది నాగేశ్వరరావు ప్రియాంక రాహుల్ కుందూరు అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -