Wednesday, September 30, 2026

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు పూలదండలు వేసి సత్కరించాల్సిన అవసరం మనకు ఉన్నప్పటికీ కొంతమంది దుండగులు కావాలని కక్షపూరితంగా వారికి చెప్పుల దండతో వేసి అవమానించారు

- Advertisment -

నేటి వారధి న్యూస్
ఈస్ట్ గోదావరి జిల్లాలోని దుపుచర్ల గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు చెప్పులు దండ మెడలో వేసి అవమానించారు వారిని కఠినంగా శిక్షించాలి అంటూ కొన్ని కొన్ని సంఘాల వారు వ్యతిరేకిస్తూ ధర్నా చేయడం దాని గురించి ధర్నాలు చేస్తూ ర్యాలీలు చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కుల మతం విభేదం లేకుండా ప్రతి మనిషికి కావలసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కావడంతో చాలామంది బాధాకరమైన విషయం అని వాళ్ళ బాధ వ్యక్తం చేసుకుంటున్నారు కొంతమంది దుండగులు రాత్రిపూట తాగుబోతులు ఏమి చేయాలో తెలియకుండా ఇలాంటివి చేస్తున్నారు గత రెండు నెలల క్రితం ఇదే విషయం ద్వారకాతిరుమల గ్రామంలో కూడా జరిగినప్పటికీ అప్పుడు ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు మరియు బహుజన నాయకులు పోలీసు వారికి చర్య తీసుకోమని చెప్పినప్పటికీ ఎటువంటి చర్య తీసుకోకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండా రమేష్ దళిత ప్రజా సమితి అధ్యక్షులు కాబుదాసి రవి మాల సేన అధ్యక్షులు ఏరుకుపాటి విజయకుమార్ బహుజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తాడేపల్లి రమేష్ జై భీమ్ సేన ఇండియా జిల్లా అధ్యక్షులు పీతల సోమరాజు మాల మహాసేన నాయకుడు మానకొండ రాజశేఖర్ గోపాలపురం నియోజకవర్గం జనసేన ఇన్చార్జ్ దొడ్డి కర్ల సువర్ణ రాజు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం డాక్టర్ మెండం సంతోష్ కుమార్ పాల్గొన్నారు వీరందరూ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేయడ నీ ఖండిస్తున్నారు మరియు జిల్లా ఎస్పీ వచ్చి నా యొక్క ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటామని మరోసారి ఇటువంటి ఘటన జరగనివ్వకుండా చూసుకుంటామని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద తప్పకుండా సీసీ కెమెరా పెట్టిస్తామని వారు తెలియపరచడం జరిగినది

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -