నేటి వారధి న్యూస్
శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఈ రోజు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందోహంతో గోచరిస్తోంది.
భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కార్యనిర్వహణ అధికారి రమాదేవి ఆధ్వర్యంలో దేవస్థానం సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్, అన్నదానం, తీర్థప్రసాద పంపిణీ నిర్వహణలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.
స్వామివారి కళ్యాణాన్ని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచే భారీగా చేరుకున్నారు. ఆలయ పరిసరాలు “సీతారామ” నామస్మరణలతో మార్మోగుతున్నాయి.
భద్రాచలం దేవస్థానంలో భక్తుల రద్దీ
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

