నేటి వారధి న్యూస్
ఖమ్మం. స్థానిక 46 డివిజన్ పరిధిలోని జూబ్లీపుర అంగన్ వాడి కేంద్రంలో సామూహిక అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ కన్నం వైష్ణవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రం ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం ప్రభుత్వం అందిస్తుందని పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు అంగన్వాడి సిబ్బంది సహకరిస్తున్నారని వారి సేవలను కొనియాడారు. చిన్నపిల్లలకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలని సూచించారు. బడి ఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు నాగలక్ష్మి సంధ్య, హెల్పర్స్ సత్యవతి జయలక్ష్మి స్థానిక మహిళలు చిట్టూరి శారద, కంకల సంధ్య బుంగ గురవమ్మ, మంగ అలివేలు తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీ కేంద్రంలో అన్నప్రాసన కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ కన్నం వైష్ణవి
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

