నేటి వారధి న్యూస్
పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్ నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్.రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయమని పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్ అన్నారు. ఉమ్మడి నిజాంసాగర్, మహ్మద్ నగర్ మండల కేంద్రంలోని సుల్తాన్ నగర్, హసన్ పల్లి, గిర్ని తాండ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని
పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్, ఏలే మల్లికార్జున్, రవీందర్ రెడ్డి రైతులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…. రైతులు ఆరుగాలం కష్టపడ్డ ధాన్యానికి మద్దతు ధర అందించాలనే సంకల్పంతో రైతులకు అందుబాటులో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం రామ్ నారాయణ గౌడ్, వ్యవసాయ శాఖ అధికారిని నవ్య, ఏ ఈ ఓ స్వర్ణలత, రేణుక, నాయకులు సవాయిసింగ్, ప్రజా పండరి, మల్లయ్య గారి ఆకాష్, బాల్ సాయిలు, హరిన్, ఐకెపి సీసీలు శ్రీకాంత్, సాయిబాబా, రైతులు తదితరులు పాల్గొన్నారు.
రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి…
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

