Saturday, April 4, 2026

గ్యాస్ డీజల్ పెట్రోల్ ధరల పెంపు బీజేపీ ప్రజలను లూటి చేసే దానికి నిదర్శనం..

- Advertisment -

నేటి వారధి న్యూస్
సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ఖమ్మం డివిజన్ కార్యదర్శివర్గ సభ్యులు తేలే రాకేష్
కేంద్ర బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరను 50 రూపాయలు, డీజల్ పెట్రోల్ ధరలను 2 రూపాయలు చొప్పున పెంచడాన్ని ప్రజలను లూటి చేసే చర్యగా సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) బావిస్తూ తీవ్రంగా నిరశిస్తుంది అని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు తేలే రాకేష్ అన్నారు. గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలను పెంచడాని నిరసిస్తూ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కామేపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం కామేపల్లి మండల కేంద్రంలో గ్యాస్ సిలిండర్ తో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా తేలే రాకేష్ మాట్లాడుతూ ఇప్పటికే GST పేరుతో ప్రజల జేబులు గుల్ల చేస్తుంది. ధరల పెరుగుదలతో మరోపక్క సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. నిరుద్యోగం, అసంఘటిత రంగం, మధ్యతరగతి, రైతాంగం బీజేపీ విధానాలతో బతుకు భారమై సతమతమవుతున్నది. మోడీ, షాలు అంటే మోసాలు దేశ వనరులను బడా కార్పొరేట్లకు కట్టబెడుతూ, వారికి రాయితీలు, బకాయిలు రద్దు చేస్తూ…. ప్రజల మీద భారాలు మోపుతూ… ఈ మోసపూరిత విధానాలను కప్పిపెట్టుకోవడానికి మత ఉన్మాదాలను రెచ్చగొడుతున్నారు. ఫాసిస్ట్ విధానంతో నోళ్లు మూయిస్తున్నారు. అమెరికా బెదిరింపులకు తలొగ్గి సుంకాలు తగ్గిస్తున్నారు.
ఇప్పటికే గ్యాస్, పెట్రోల్ డీజిల్ ఉత్పత్తుల ధరలు అనేకసార్లు పెరిగాయి. దాని మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బడిముబ్బడిగా దోచుకుంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో లో బ్యారల్ ధర తగ్గుతుంటే…. మన దేశములో పెంచడం దుర్మార్గ చర్య.
పెంచిన నిత్యవసర వస్తువులతోపాటు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల ధరలు తగ్గించాలని వారు డిమాండ్ చేశారు బీజేపీ ప్రభుత్వ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మాస్ లైన్ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని రాకేష్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాస్ లైన్ నాయకులు స్థానికులు వసంతరావు రహీం ఉమా సైదాబీ రహమాన్ బి రాంబాయి రమాదేవి తోట సావిత్రి నాగేంద్ర హుస్సేన్ బి సప్రియ రాములమ్మ పాల్గొన్నారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -