నేటి వారధి న్యూస్
భద్రాచలం, భద్రాద్రికొత్తగూడెం.జిల్లా,
జమ్మూ కశ్మీర్‌లోని పెహల్గాం ప్రాంతంలో జరిగిన దుర్ఘటనలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ సంఘటన నేపథ్యంలో శుక్రవారం దేవస్థాన పరిపాలన బృందం, ప్రధాన అర్చకులు, వైదిక సిబ్బంది మృతులకు సంతాపం ప్రకటించారు.
మానవీయ కోణాన్ని కళ్లకు కట్టేలా స్వామివారి సన్నిధిలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, బాధిత కుటుంబాలకు ఆ పరమాత్మ ఆదరణ కలగాలని ప్రార్థనలు నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయంలో హోమాలు, సుదర్శన యాగం వంటి కార్యక్రమాలు కూడా చేపట్టే అవకాశం ఉంది. భద్రాచల దేవస్థానం తరఫున ప్రతి జాతీయ విషాద ఘటనపై ఇలా స్పందించడం శ్లాఘనీయం అని భక్తులు అభిప్రాయపడుతున్నారు.
పెహల్గాం ఘటనపైభద్రాచల దేవస్థానం సంతాపం – మృతుల పట్ల శాంతికై ప్రత్యేక పూజలు
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

