నేటి వారధి న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఇల్లందు పోలీస్ స్టేషన్ ను సందర్శించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు.అనంతరం అక్కడ ఉన్న పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు.పోలీస్ స్టేషన్ కు వచ్చిన భాదితుల సమస్యలను తెలుసుకుని తక్షణమే విచారణ చేపట్టి న్యాయం చేకూరేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని,వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధ్యతగా మెలగాలని.సూచించారు.అనంతరం పోలీస్ స్టేషన్లో నమోదైన పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు.కంటికి కనపడకుండా ఆన్లైన్ ద్వారా సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించేలా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.సైబర్ నేరాల బారిన పడకుండా జిల్లా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ విస్తృతస్థాయిలో ప్రచారం చేయాలని తెలిపారు.బెట్టింగ్,గంజాయి రవాణా వంటి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగే విధంగా ప్రవర్తించే వ్యక్తులను గుర్తించి అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఇల్లందు డిఎస్పి చంద్రభాను,సిఐ సత్యనారాయణ,ఎస్సై శ్రీనివాసరెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.
ఇల్లందు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

