Friday, April 3, 2026

యూనియన్ జిల్లా నేత జయప్రకాష్ ను ఘనంగా సన్మానం చేసిన ఆశాలు

- Advertisment -

నేటి వారధి న్యూస్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ఐ ఎన్ టి యు సి జోగులాంబ గద్వాల జిల్లా ప్రెసిడెంట్ ఆర్ పి జయప్రకాష్ ను రాజోలి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలు శుక్రవారం ఘనంగా సన్మానం చేశారు. ముందుగా కేక్ ను కట్ చేసి స్వీట్లు, కార పంచి పెట్టారు. తదనంతరం యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ ఆర్ పి జయప్రకాష్ ను శాలువా కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆశా కార్యక్రమాలను ఉద్దేశించి యూనియన్ నేత జయప్రకాష్ మాట్లాడుతూ చాలి చాలని జీతాలు తీసుకొని ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారని ఆయన చెప్పారు. గర్భిణీ స్త్రీలకు, శిశువులకు ప్రతి బుధవారం, శనివారం వ్యాధినిరోధక టీకాలు ఇప్పిస్తున్నారని వారిని కొనియాడారు. అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ క్షయ వ్యాధి రోగులకు, బి పి, షుగర్ రోగులకు మందులు అందిస్తూ వారిని ఆదుకుంటున్నారని ఆయన తెలిపారు. ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్ ప్రతి నెల 18000 వేల రూపాయలు ఇవ్వాలని, యూనిఫాం, రిజిస్టర్ల్, నోట్ బుక్ లు, పెన్ లు, తదితర అవసరాలు తీర్చి వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు సుజాత, అనిత, మంజుల, విజయలక్ష్మి, రామలక్ష్మ, రేణుక, జయంతి, రేణుక తదితరులు పాల్గొన్నారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -