నేటి వారధి న్యూస్
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అదేశాలనుసారం వేమనపల్లి మండల పరిషత్ కార్యాలయంలో.. పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ (PAI) పై మండల స్థాయి అవగాహన సమావేశం నిర్వహించారు. 2023/24 సంవత్సరంలో.. ఆర్థికంగా సాధించిన వాటిపై, పలు అంశాలపై ఆయా శాఖల వారికి తెలియజేశారు. రెవెన్యూ శాఖ, పంచాయతీ రాజ్ శాఖ, రూరల్ డెవలప్మెంట్ శాఖ, వ్యవసాయ శాఖ, విద్యా శాఖ, ఐసీడీఎస్, ఆరోగ్య శాఖ, RWS, మిషన్ భగీరథ, ఎలక్ట్రిసిటీ, పోలీస్ శాఖ, హౌసింగ్ శాఖ వారి సహకారంతో.. పంచాయతి కార్యదర్శులు రెండు రోజుల్లో సేకరించి సంభందిత పోర్టల్ లో నమోదు చేయాలని, ఆయా శాఖల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ, ఎంపీఓ, ఆయా శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు
ప్రభుత్వ శాఖల వారితో మండల స్థాయి సమావేశం
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

