Friday, April 3, 2026

అడవి ఆవుల వేటగాళ్ల పై అటవీ అధికారులు దాడులు.

- Advertisment -

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
తిరుపతి జిల్లా డక్కిలి మండలం ఆల్తూరుపాడు బీట్ పరిధిలో అడవి ఆవులను వేటగాళ్లు విద్యుత్ తీగలు తీసి వాటిని చంపడం జరుగుతుంది. అది తెలుసుకున్న ఫారెస్ట్ డిఆర్ఓ ప్రతాప్ రెడ్డి వారి సిబ్బంది తో కలిసి అడవిలో కి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టాగా వేటగాళ్లు తప్పించుకుని వెళ్లిపోగా ఉచ్చులు, తీగలు, విద్యుత్ వైర్లు దొరకడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఫారెస్ట్ డిఆర్ఓ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ సమీప గ్రామాలలోని వ్యక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నరు. మనం గోమాతగా కొలిచే అడవి ఆవులను కరెంటు తీసి చంపడం చాలా నేరం అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. మరియు సమీప గ్రామాలలోని ప్రజలు తమ బాధ్యతగా తీసుకొని ఇలాంటి పనులు చేస్తున్న వ్యక్తుల గురించి మా అటవీ అధికారులకు తెలియజేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి పొరపాట్లు ఇంకెవరు చేయకుండా చూస్తామని తెలియజేశారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -