Friday, April 3, 2026

డక్కిలిలో బాబు షూరిటీ – మోసం గ్యారంటీ

- Advertisment -

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
AP : వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి సూచనలతో గురువారం డక్కిలిలో బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైయస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు చింతల శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో సూపర్ సిక్స్ పథకాలు అంటూ చంద్రబాబు చేసిన మోసాలను క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేయించి చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు వివరించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చి.. తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు పెట్లూరు జగన్మోహన్ రెడ్డి, నర్రావుల వేణు నాయుడు, కోళ్లపూడి వేణు, మురళి, బాబు, బండి రమేష్ రెడ్డి, వెంకటరమణ యాదవ్, రమణయ్య, జానకి రామ్, కోటి, గోపాల్ యాదవ్, అరుణాచలం, శంకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -