Friday, April 3, 2026

నవజీవన్ ఆర్గనైజేషన్ – సి.సి- పి.యు- ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఇంటెన్షిఫైడ్  ఐ.ఇ.సి క్యాంపెయిన్ కార్యక్రమం ద్వారా హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ పై అవగాహన

- Advertisment -

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో ఈరోజు నవజీవన్ ఆర్గనైజేషన్ -సి.సి- పి.యు- ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ” ఇంటెన్షిఫైడ్ ఐ.ఇ.సి క్యాంపెయిన్” కార్యక్రమం ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన సదస్సును వెంకటగిరి లోని “గవర్నమెంట్ జూనియర్ కళాశాల” నందు నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమములో భాగముగా ప్రాజెక్ట్ మేనేజర్ అయిన కె. బాలాజి మాట్లాడుతూ, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాప్తి కారకాలు, ఎలా వ్యాపించదు, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ లక‌్షణాలు, అవి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా ఎలాగా సమాజములో కలసి జీవించాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్, క్షయ వ్యాధి సంబందం గూర్చి, సుఖ వ్యాధులు మరియు చికిత్స గూర్చి,కండోమ్ యొక్క ఉపయోగము గూర్చి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ ఏక్ట్ 2017, ఎ.ఆర్.టి మందులు, ఏ.పి.శాక్స్ యాప్ ,టోల్ ఫ్రీ నెంబర్ 1097 గూర్చి తెలుపుతూ, మీ ద్వారా తెలియని వాళ్లకు తెలియజేయమని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ జి. రవికుమార్, యన్.యస్.యస్. ప్రాజెక్టు ఆఫీసర్లు ఎ. వెంకటశేషయ్య, సి. రామ్ గోపాల్, ఓ.ఆర్.డబ్ల్యూ – యమ్. ముని కుమారి, ఎ.యన్.యమ్- జి. శ్రీ లత, పి.ఇ లు మరియు 210 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. తదుపరి జగన్ కాలని ఏరియా లో హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన కల్పించడం కోసం మీటింగ్ మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో 60 మంది ప్రజలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. వీరిలో 12 మంది ప్రజలుకు నవజీవన్ సంస్థ ఎ.యన్.యమ్ ద్వారా హెచ్.ఐ.వి పరీక్షలు చేయించి వారి స్థితిని వారికి తెలియజేయడం జరిగింది.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -