Saturday, April 4, 2026

నడిచే దారిపై ఎన్ని కుట్రలు.రౌడీలతో దాడి చేసి చంపుతా అని బెదిరింపులు.

- Advertisment -

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
రౌడీలతోనే వ్యభిచారం చేపిస్తా ఒక మహిళ ను కించపరుస్తు మాట్లాడిన మాజీ సర్పంచ్ భూక్య రమేష్.రైతు మహిళా పై అరాచక దౌర్జన్యం.మొదటి భార్య మనవడు దేవేందర్ పై దాడికి ప్రయత్నం.
ఎలాంటి సంబంధం లేని మాజీ సర్పంచ్ రమేష్ నాయక్ కలిసున్న కుటుంబాన్ని విడదీస్తున్న ప్రయత్నంలో రమేష్ నాయక్.మాజీ సర్పంచ్ భూక్యా రమేష్ మాటలతో ఏకభవిస్తూ బోడ దేవేందర్ పై దాడి.బోడ కుమారి దేవేందర్ ఆరోపణ.మహబూబాబాద్ జిల్లా,కురవి :పదిమందికి న్యాయం చెప్పాల్సిన ప్రజాప్రతినిదే ఓ మహిళాపై అరాచకం చేస్తున్న వైనం. అది ఎవరో కాదు మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తట్యి తండ కు చెందిన మాజీ సర్పంచ్ భూక్యా రమేష్.ఓ మహిళ రైతుపై కర్రలతో తండ పెద్దల సమక్షంలో దాడి చేయడానికి ప్రయత్నిస్తూ అరాచకం సృష్టించాడు.బాధితురాలి కథనం ప్రకారం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లోని తట్యి తండ కు చెందిన బోడ మంగ్యా నాయక్ ఆ రైతుకు ఇద్దరు భార్యలు.మొదటి భార్య సోనియా కి ఇద్దరు సంతానం ఒక కుమారుడు బోడ హచ్య, ఒక కూతురు, రెండో భార్య కోమిటికి నలుగురు సంతానం. కోబల్, సంత్య, తారాచంద్, రామ్ చంద్,అయితే వారసత్వంగా ఉన్నటువంటి భూమిని తమ వారసులకు సుమారు 3 ఎకరాల చొప్పున పంచి ఇవ్వడం జరిగింది.ఉమ్మడిగా ఐదుగురు కుమారులు వారసత్వంగా వచ్చిన భూమిని పంచుకోవడం జరిగింది.తదుపరి వారి వారసులు బోడ హచ్య నాయక్ కుమారుడు దేవేందర్,రెండవ భార్య నలుగురు కుమారుల్లో బోడ విజయ్, బోడ కోటేష్, బోడ రమేష్, బోడ రాజేష్ లు వారికి సుమారు వారసత్వంగా మూడు ఎకరాల భూమిని పంచడం జరిగింది. సాఫీగా ఉమ్మడిగా సాగుతున్న ఈ కుటుంబంలో ఒక ప్రజా ప్రతినిధి మాజీ సర్పంచ్ భూక్య రమేష్ కుటుంబంలో స్విచ్ పెట్టి, రెండవ భార్య వారసుల మనవాళ్లను ఎగేస్తూ,మొదటి భార్య మనవడు దేవేందర్ పై దాడికి ప్రయత్నం చేస్తున్నారు. 2021 ఏప్రిల్ 14న బోడ కుమారి పై, బోడ దేవేందర్ పై భూమి గట్టు విషయంలో దాడికి పాల్పడ్డారు. దీనితో మనస్థాపనకు గురైన బోడ దేవేందర్ కురవి పోలీస్ స్టేషన్లో 2021 ఏప్రిల్ 14న ఫిర్యాదు చేసి వారి కొట్టిన దెబ్బలకు భరించలేక గడ్డి మందు తాగాడు.ఈ విషయంలో అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేసి నిందితులపై కేసు నమోదు చేశారు. బాధితుడు 9 మందిపై ఫిర్యాదు చెయ్యగా అందులో బోడ కోటేష్, బోడ రాజేష్,బోడ కోటేష్,బోడ రాజేష్,బోడ బుజ్జి,భూక్యా రమేష్ రాజకీయ అండదండలతో అధికారులు వీరిని తప్పిస్తూ మిగతా వారిపై కేసు నమోదు చేశారు. వారసత్వంగా ఐదుగురు కుమారులలో బోడ తారాచంద్ 14 గుంటల భూమిని అమ్మడానికి పెద్దల సమక్షంలో విషయం తెలిపారు. అందులో భూమి పక్కనే ఉన్న బోడ దేవేందర్ బాయానగా 10,000 రూపాయలుగా పెద్దలకు సమర్పించారు.రాజకీయ పలుకుబడిలతో భూక్యా రమేష్ కావాలని ఉమ్మడిగా ఉన్న కుటుంబంలో స్విచ్ పెడుతూ బోడ కోటేష్ తో 30 వేల రూపాయలు ఆయన పెట్టించాడు. ఆ క్రమంలో ఉమ్మడి కుటుంబంలో స్విచ్ పెట్టి గొడవలు సృష్టించి దేవేందర్ ని మానసికంగా దెబ్బతీయడానికి ప్రయత్నించాడు.తదుపరి గ్రామ పెద్దలు ఉమ్మడి కుటుంబాన్ని ఐక్యత కోసం 2025 జూన్ 9న,పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్న సందర్భంలో పెద్దమనుషులు వారసత్వంగా సంక్రమించిన గ్రామ రెవెన్యూ భూమి తమ దారి కోసం బోడ విజయ్, భూక్యా వేంకన్న,బోడ అరుణ్ బోడ గోదావరి ,బోడ రాజేష్,బోడ బుజ్జి, బోడ పార్వతి లు, మాజీ సర్పంచ్ భూక్యా రమేష్ మాటలతో ఏకభవిస్తూ బోడ దేవేందర్ పై దాడికి దిగారు. దీంతో 2025 జూన్ 29న, కురవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానన్నారు. దీంతో గ్రామ పెద్దలు కలగజేసుకొని కుటుంబ ఐక్యత కోసం ఓ నిర్ణయానికి వచ్చి గట్టు దారి కోసం ఒక నిర్ణయానికి వచ్చారు. గట్టులో ఇరువురు రైతులు రెండు రెండు ఫీట్లు నాలుగు ఫీట్ల దారి కల్పించే విధంగా వారి వాంగ్మూలంతో పెద్దమనుషులు అగ్రిమెంట్ చేశారు. కానీ ఈ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నిస్తున్న మాజీ సర్పంచ్ భూక్యా రమేష్, కలగజేసుకొని బోడ దేవేందర్ తన భూమి చుట్టూ రెండు ఫీట్లను వదిలేసి పంట రక్షణ కోసం కనీలతో ఫెన్సింగ్ తిప్పుకున్నారు. కాగా 2025 జూన్ 29న, పెద్దల సమక్షంలో రాయించుకున్న అగ్రిమెంట్ ప్రకారంగా అగ్రిమెంటును ధిక్కరించిన వారికి 50,000 జరిమానా విధించడం జరిగింది. అందుకు ఇరుగురు అంగీకరించారు. దాన్ని ధిక్కరిస్తూ బోడ దేవేందర్ కేటాయించిన రెండు పీట్ల దారిలో నడుస్తున్నారు. కానీ పెద్దల అగ్రిమెంట్ను ధిక్కరిస్తూ రెండు ఫీట్ల దారిను ఇవ్వకపోగా పంట రక్షణ కోసం బోడ దేవేందర్ ఏర్పాటు చేసుకున్న ఫెన్సింగ్ కనీలను శనివారం మాజీ సర్పంచ్ భూక్యా రమేష్ అండదండలతో ధ్వంసం చేశారు. ఈ విషయంపై పెద్దల సమక్షంలో మాట్లాడడానికి పోతే మాజీ సర్పంచ్ భూక్యా రమేష్ కలగజేసుకొని నీ అంతు చూస్తారా.అని అంటూనే నీ భార్య కుమారిని హత్యాచారం చేపిస్తానంటూ కర్రతో పెద్దల సమక్షంలో దాడికి ప్రయత్నించారు. వారిపై పోలీస్ అధికారు విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. దాంతోపాటు ఎప్పుడు ఏ సమయంలో పాగ ఏసి హత్య చేయడానికి పాల్పడే అవకాశం ఉన్న విన్నది కనుక మాకు రక్షణ కల్పించాలని గిరిజన మహిళ రైతు బోడ కుమారి కోరారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -