Saturday, April 4, 2026

స్థానిక సమస్యలు తక్షణమే పరిష్కరించాలి బిజెపి జిల్లా ఆఫీస్ సెక్రెటరీ పల్లె సందీప్ గౌడ్.

- Advertisment -

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
మహబూబాబాద్ :బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గ్రామాలలో మరియు తండాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని,స్థానిక ఎమ్మార్వో కి వినతి పత్రం ఇవ్వాలన్న పిలుపు మేరకు బిజెపి కొరవి మండల అధ్యక్షులు భూక్య కిషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీసులో విజయ కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి భారతీయ జనతా పార్టీ మానుకోట జిల్లా ఆఫీస్ సెక్రటరీ పల్లె సందీప్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ…మండలంలో ఉన్న గ్రామ పంచాయతీల్లో మరియు తండాలలో ఇటీవల కురిసిన వర్షాలకు ఏర్పడినటువంటి గుంతలను పూడ్చాలని,తండాలకు బీటీ రోడ్లను నిర్మించాలని అంటు వ్యాధులు వ్యాపించకుండా గ్రామాలలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు.దోమల నివారణకి ఫాగింగ్ చేయాలని మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆసుపత్రిని 50 బెడ్ల వసతికి పెంచాలని గ్రామాలలో వైద్యులు ఎప్పుడు అందుబాటులో ఉండాలా చూడాలని వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. కార్యక్రమంలో బిజెపి మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొనతం పెంటయ్య,పార్టీ సీనియర్ నాయకులు శంకర్ రావు,నామనాగేశ్వరావు కురవి మండల బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శులు జిన్నె కృష్ణ,కొనతం వెంకటేష్,
భూత్ అధ్యక్షులు బొమ్మగాని నారాయణ,
జిన్నె నరేందర్,దిలీప్,వెంకన్న,వెంకటేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -