11 మంది 16 లక్షలు 90 వేల రూపాయలు బ్యాంకు రుణం తీసుకున్నారు.ముఠా నుండి 22 దొంగ పట్టా పాస్ బుక్కులు స్వాధీనం.
నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
మండలంలోని కొరవి పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పట్టా పాస్ బుక్కులు తయారు చేసే ముఠాని అరెస్ట్.నకిలీ పాసుబుక్కులు తయారు చేసే ముగ్గురిని పట్టుకున్న కురవి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్,సీసీఎస్ సి.ఐ కలిసి చాకచక్యంగా పట్టుకున్నారు.ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో డి.ఎస్.పి తిరుపతిరావు మాట్లాడుతూ…మహబూబాబాద్ జిల్లా ఎస్పి సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆదేశాల మేరకు జిల్లాలోని నకిలీ పట్టా పాస్ బుక్ ద్వారా అమాయక రైతులుమోసపోతున్నారని,వీటిపై పోలీసు వారు నిఘా నేత్రం ఏర్పాటు చేశామన్నారు.ఆ నిఘా నేత్రంలో వలయంలో నకిలీ పట్టా పాస్ బుక్ లు తయారు చేసే ముఠాని గురువారం కురవి పోలీస్ స్టేషన్ వారు పట్టుకోవడం జరిగిందన్నారు.నిందితులు లంబాడా(ఎస్టీ)కమ్యూనిటీకి చెందిన ముగ్గురు వ్యక్తులు (మూద్ బాలాజీ,బానోత్ హరికిషన్, మరియు బానోత్ వర్ధన్) కీలక నేరస్థులుగా గుర్తించారు.డబ్బుకు బదులుగా పెద్ద మొత్తంలో రుణాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చి రైతులను మోసం చేశారని,ఆపై కురవి, డోర్నకల్,మహబూబాబాద్‌లలో వివిధ బ్యాంకుల (యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్) నుండి రుణాలు పొందడానికి నకిలీ పాస్‌బుక్‌లు మరియు భూమి పత్రాలు (1B, EC) సృష్టించారని ఆరోపించారు.ఈ పథకం ద్వారా పొందిన రుణాల మొత్తం విలువ రూ. 16,90,000/-.ముగ్గురు నిందితులు కురవిలో మరిన్ని నకిలీ పత్రాలను సృష్టించడానికి ప్రయత్నిస్తుండగా పట్టుబడ్డారు,దీని వలన సుమారు కోటి రూపాయల మోసాన్ని నివారించవచ్చు అన్నారు.ఈ మోసపూరిత రుణాలకు పాల్పడిన మరికొందరు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.మోసపూరిత రుణాల లబ్ధిదారులను గుర్తించడానికి దర్యాప్తు కొనసాగుతోంది తెపారు.మూడు సెల్ ఫోన్లు,నకిలీ 22 పట్టా పాసుబుక్కులు ఒక లాప్టాప్, ఒక కంప్యూటర్,రెండు ప్రింటర్లు వారి నుండి స్వాధీనం చేసుకున్నామని అన్నారు.మహబూబాబాద్ రూలర్ సి.ఐ సర్వయ్య,కురవి సబ్ ఇన్స్పెక్టర్ గుండ్రతి సతీష్,సీసీఎస్ సి.ఐ అత్తిరాం,సిసిఎస్ ఎస్సై కుశల్,ఏఎస్ఐ వెంకన్న,పోలీస్ సిబ్బంది హరి ప్రసాద్, వీరన్న నాయక్, అనిత, నరేష్, రమేష్ వెంకటయ్య, పాల్గొన్నారు.

