నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
ఖమ్మం:ఉపాధ్యాయుడు సమాజ నిర్మాత అని మంగళ గూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి శ్రీనివాస్ అన్నారు శనివారం ఆ పాఠశాలలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత
పంజాల ఐలయ్య ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించి ప్రసంగించారు. కృషి పట్టుదలతో విద్యాబోధన చేసిన వారికి ఎల్లవేళలా గుర్తింపు ఉంటుందని ఆయన అన్నారు. అంకితభావం క్రమశిక్షణతో విధులు నిర్వహించే ఉపాధ్యాయులు తమ వృత్తిలో రాణిస్తారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఐలయ్య దంపతులను ఘనంగా సత్కరించి సన్మాన పత్రాన్ని మెమో అందజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు యాదగిరి శ్రీదేవి బి శ్రీనివాస్ డివిఎన్ రెడ్డి, బి కిట్టుకూద్దూస్ లక్ష్మణరావు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు
ఉపాధ్యాయుడు సమాజ నిర్మాత
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

