Saturday, April 4, 2026

జర్నలిస్టులకు  ఇళ్ల స్థలాలను వెంటనే  అప్పగించాలిఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు

- Advertisment -


జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను పరిశీలించిన జర్నలిస్టుల బృందం

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
ఖమ్మం జర్నలిస్టులకు కేటాయించిన 23.02 ఎకరాల ఇళ్ల స్థలాలను ప్రభుత్వం వెంటనే జర్నలిస్టులకు అప్పగించాలని, క్యాబినెట్ ఆమోదం పొంది, జీవో జారీ చేసి దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంతవరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించలేకపోవడం బాధాకరమని ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం లోని ఎస్ ఆర్ గార్డెన్ సమీపంలోని ఎన్ఎస్ పి కాల్వకట్టపై జర్నలిస్టులకు 23.02 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు గత ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల ఆస్థలంలోని కొంత భాగంలో అధికారులు ఫెన్సింగ్ చేసి మొక్కలను నాటారు. కొందరు అక్రమార్కులు గుట్టు చప్పుడు కాకుండా విలువైన గ్రావెల్స్ ను తరలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న జర్నలిస్టుల బృందం శనివారం జర్నలిస్టులకు కేటాయించిన స్థలాలను పరిశీలించారు.
అనేక అడ్డంకులు సృష్టిస్తూ జర్నలిస్టుల స్థలాలను సైతం ఇతరులకు కట్టబెట్టే వ్యవహారాన్ని తక్షణమే విరమించుకోవాలని, కాలయాపన చేయకుండా స్థానిక సంస్థలు ఎన్నికల కంటే ముందే జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాలను అప్పగించాలని రమేష్ బాబు విజ్ఞప్తి చేశారు.
ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారానికి జర్నలిస్టులు అంతా ఐక్యంగా కలిసి ముందుకు రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జే (టి జే ఎఫ్) ప్రెస్ క్లబ్ కార్యదర్శి కొరకొప్పుల రాంబాబు, కోశాధికారి బిక్కి గోపి, ఉపాధ్యక్షులు ముత్యాల కోటేశ్వరరావు, సాక్షి సబ్ ఎడిటర్ అచ్చిరెడ్డి, నమస్తే తెలంగాణ సబ్ ఎడిటర్లు సముద్రాల శ్రీధర్, ఎస్ కే జానీ, సహాయ కార్యదర్శి మూల జీవన్ రెడ్డి, జర్నలిస్టు నేతలు పి. పానకాలరావు, ఉల్లోజు రమేష్, వెంకటరెడ్డి, ఐ న్యూస్ బ్యూరో కే .నాగేశ్వరరావు, మోహన్, గోవింద్, అప్పారావు, ఎస్ డి యాదగిరి, రోజా, ప్రైమ్ 9 సాయి, పులి శ్రీను, పెంటి వెంకటేశ్వర్లు, ప్రభాకర్ రెడ్డి, నాగరాజు, శ్రీనివాస్

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -