టీవీ రావు సినీ పరిశ్రమలో ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా కష్టపడే వ్యక్తి..
నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
4/9/2025
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అతడు గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగినా..చిత్ర పరిశ్రమలో స్థిరపడాలన్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. మణుగూరు మండలం రామానుజవరం గ్రామానికి చెందిన దోమకొండ రాంబాబు (డ్రమ్స్ రాము)చిత్ర.పరిశ్రమలో సంగీత దర్శకుడిగా రాణిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.సంగీతంపై మక్కువతో 2005లో డిగ్రీ పూర్తి చేసినతర్వాతపియానో.వాయిద్యాన్నినేర్చుకున్నారు.సినిమాల్లో పనిచేయాలని నిర్ణయించుకుని చిత్ర పరిశ్రమలో డ్రమ్ ప్లేయర్గా తన కెరీర్నిప్రారంభించారు.2012లో సొంత సంగీతం స్టూడియో ఏర్పాటుచేసుకున్నారు.తర్వాత వెనుదిరిగి చూడకుండా మ్యూజిక్ డైరెక్టర్గా సినిమాలు చేయటం ప్రారంభించారు.నా పంచప్రాణం,లడాయి,స్టూడెంట్ స్టార్,అతడెవడు వంటి తెలుగు సినిమాలతో పాటు,డ్రాయింగ్ బ్లడ్ వంటి ఇంగ్లిష్ సినిమాలకు సైతం మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారు.తాళికట్టు శుభవేళ వంటి సీరియల్కి సంగీతాన్ని సమకూర్చారు.ప్రస్తుతం ఇంద్రాతి,షూటర్ వంటి సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్గా పని చేస్తున్నారు.
చిరంజీవిపై అభిమానంతో..
రాంబాబుకి చిన్నతనం నుంచి సినీ నటుడు చిరంజీవి అంటే అభిమానం.చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూనే నూతనంగా ఓ చిత్రానికి దర్శకత్వం వహించారు.
చిరంజీవిపైఅభిమానంతో..వీరాభిమాని అనే చిత్రానికి దర్శకత్వంతో పాటు సంగీతాన్ని అందించారు.ఇది సెప్టెంబర్ నెలలో విడుదల కానుంది.మణుగూరుకి చెందిన కళాకారులతో తాను సంగీతం వహించిన చిత్రాల్లో పాటలు పాడిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు..

