నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
మదర్ సర్వీస్ సొసైటీ వారి 3వ వార్షికోత్సవం వేడుకలు విజయవాడ లో నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళనాడు, కేరళ, ఒరిస్సా, కర్ణాటక, ఢిల్లీ, తెలంగాణ, ఆంద్రప్రదేశ్, రాష్ట్రాలకు చెందిన వివిధ రంగాలలో సేవ చేస్తున్న సుమారు 150 మందికి సేవా అవార్డులు ప్రధానం చేశారు. ఇందులో భాగంగా అన్నమయ్య జిల్లా కలకడ మండలం నడిమి చర్ల కు చెందిన చలువ నాగేశ్వర రావు ను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు.పురస్కారంతో పలువురు ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్.సి కమీషన్ ఛైర్మన్, మాజీ మంత్రి వర్యులు అయిన కొత్తపల్లి శ్యామ్యుల్ జవహార్, కలెక్టర్ & ఎన్.టి.ఆర్ జిల్లా మేజిస్ట్రేట్ లక్ష్మీషా, సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఇంటిలిజెంట్స్ జి. నాగబాబు, డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఇంటిలిజెంట్స్ కె. రాంబాబు తదితరులు సత్కరించారు. అధ్యాపకుడిగానే కాక నాటక, టీవీ, సినీ నటుడిగా, రచయితగా, గేయ రచయితగా, నాటక దర్శకుడిగా, కళా రంగానికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు అందజేశామని మదర్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మల్లాది ప్రసాదరావు తెలియజేశారు.
చలువ నాగేశ్వరరావు కు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

