Friday, April 3, 2026

హైస్కూల్లో బతుకమ్మ సంబరాలు

- Advertisment -

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
ఖమ్మంరూరల్ :తెలంగాణ సాంస్కృతి కి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ఖమ్మం రూరల్ మంగళ గూడెం హైస్కూల్లో ఉత్సాహంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించారు . పాఠశాల ఆవరణమంతా పూలతో అలకరించబడగా , పేరెంట్స్ , ఉపాధ్యాయునిలు , విద్యార్థినులు రంగురంగుల దుస్తుల్లో, విద్యార్థులు వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయునిలు కలిసి సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను తయారుచేసి వాటి చుట్టూ తిరుగుతూ.. బతుకమ్మ పాటలు పాడారు . పాఠశాల ఆవరణమంతా పండుగ శోభను సంతరించుకుంది . ఈ వేడుకలో తల్లిదండ్రులు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది . ఇది విద్యార్థులకు తమ సంస్కృతి , సంప్రదాయాలను పెద్దల నుంచి నేర్చుకోవడానికి మంచి అవకాశం కల్పించింది . ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ బతుకమ్మ పండుగ కేవలం పూల పండుగ మాత్రమే కాదు , ఇది ప్రకృతిని , జీవితాన్ని పూజించే పండుగ . మన సంస్కృతిని , వారసత్వాన్ని భావితరాలకు అందించడం చాలా అవసర మన్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇలా కలిసి వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు . ఈ వేడుకలు విద్యార్థులలో వారి కుటుంబాలలో సాంస్కృతిక స్ఫూర్తిని , ఐకమత్యాన్ని పెంపొందించాలని పేర్కొన్నారు . ఈ కార్యక్రమం ముగింపులో, సాంప్రదాయ పద్ధతిలో ఊరు చివరి వాగులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు . ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు యాదగిరి శ్రీనివాస , డివిఎన్ రెడ్డి కూద్దూస్ కిస్టు అమృత వర్షిని జయరాజ్ తదితరులు పాల్గొన్నారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -