నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
ఖమ్మం స్థానిక 46వ డివిజన్ పరిధిలోని జూబ్లీ పుర, సారధి నగర్ లలో CMRF లబ్ధిదారులైన జెట్ట ఎల్లయ్య కు 38,000/- మేకల సంధ్యకు 20,000/-, చీర వెంకటయ్య కు 21,000/- , CMRF చెక్కులను కార్పోరేటర్ కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణ వారి ఇంటికి వెళ్లి అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు సిఫారసు మేరకు అనారోగ్యంతో వైద్యం చేయించుకున్న వారికి ఆర్థిక సహాయంగా ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 3 చెక్కులకు కలిపి రూ||79,000/- మంజూరు చేయించడం జరిగిందని పేద ప్రజలకు సాయం అందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని వారు తెలిపారు. ఖమ్మం నియోజకవర్గం లో ప్రజా సంక్షేమానికి తుమ్మల నాగేశ్వర రావు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు షేక్ రజ్జి, నగర OBC అధ్యక్షుడు బాణాల లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్ సింగం అంజయ్య, నాయకులు తొగరు భాస్కర్ కాటం కొమురయ్య దయ్యాల నాగేశ్వరరావు జెట్ట కృష్ణయ్య బాల్దే నాగేశ్వరరావు ఎమ్మే రామకృష్ణ మేకల అశోక్ తుపాకుల మధు ఓరుగంటి మల్లేశం కేసోజు వీరాచారి, సెల్వం జ్ఞానేశ్వర్, ఎరకనబోయిన వెంకటేశ్వర్లు, చుంచు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
CMRF చెక్కులు పంపిణీ చేసిన కార్పోరేటర్ కన్నం వైష్ణవి
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

