Friday, April 3, 2026

రైతులకు శుభవార్త.. దీపావళి కానుకగా పీఎం కిసాన్ 21వ విడత నిధులు విడుదల

- Advertisment -

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు మరో శుభవార్త అందించడానికి సిద్ధమైంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకంలో భాగంగా 21వ విడత నిధులను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది.జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం, ఈ నిధులను దీపావళి పండుగ కానుకగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరో వారంలోపే ప్రతి రైతుకు ₹2,000 చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ కానున్నాయి. ఈ నిర్ణయంతో కోట్లాది మంది రైతన్నలకు పండుగ సమయంలో ఆర్థిక ఊరట లభించనుంది.ఈ నిధుల విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. అయితే, లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసే ప్రక్రియ ఇప్పటికే తుది దశకు చేరుకుందని తెలుస్తోంది. కేంద్రం ఈ పథకం కింద అర్హులైన రైతులందరికీ ఏటా మూడు విడతల్లో మొత్తం ₹6,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ 21వ విడత నగదు బదిలీ ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -