Friday, April 3, 2026

మావోయిస్టు ఉద్యమ చరిత్రలో మరో అతిపెద్ద లొంగుబాటు జనజీవన స్రవంతిలోకి ఆశన్న

- Advertisment -


ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన 200 మంది మావోయిస్టులు

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
బస్తర్‌ జిల్లా జగదల్‌పుర్‌లో లొంగిపోయిన మావోయిస్టులు
లొంగిపోయిన వారిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రూపేశ్‌ అలియాస్‌ ఆశన్న మావోయిస్టు అగ్రనేత, కేంద్రకమిటీ సభ్యుడు ఆశన్న అలియాస్‌ రూపేశ్‌ సహా 208 మంది నక్సలైట్లు లొంగిపోయారు బస్తర్‌ జిల్లాలోని జగ్‌దల్‌పూర్‌లో నిర్వహించిన నక్సలైట్ల లొంగుబాటు కార్యక్రమంలో వారంతా జనజీవన స్రవంతిలో కలిసిపోయారు మావోయిస్టు చరిత్రలోనే ఇది అతిపెద్ద లొంగుబాటుగా నిలిచింది లొంగిపోయిన తర్వాత మొత్తం 153 ఆయుధాలు అప్పగించినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది
రెండ్రోజుల క్రితం మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ భూపతి 60 మంది అనుచర నక్సలైట్లతో కలిసి మహారాష్ట్రలోని గడ్చిరోలీలో సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ ఎదుట ప్రధాన స్రవంతిలో కలిసిపోయారు
ఈ నేపథ్యంలో తాము కూడా లొంగిపోతున్నట్లు ఆశన్న ప్రకటించారుప్రస్తుతం జనజీవన స్రవంతిలో కలిసిపోయిన 208 మందిలో మాడ్‌ డివిజన్‌ కార్యదర్శి రనిత సహా 100 మంది మావోయిస్టులు ఉన్నారుఇద్దరు దండకారణ్యం స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యులు, 15 మంది డివిజనల్‌ కమిటీ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది

Weapon Details

AK 47 Rifles – 19
SLR rifles – 1
INSAS rifles – 23
INSAS LMG – 1
303 Rifles – 36
Carbines – 4
BGL Launchers – 11
12 Bore/ Single shot – 41
Pistol – 1

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -