Saturday, April 4, 2026

అక్రమ ఇసుక రవాణాని పట్టుకోండి చూద్దాం అంటున్న ఓ ఘనుడు.

- Advertisment -


భారీ ఇసుక లారీల రాకపోకలతో సీతారామ ప్రాజెక్టు కెనాల్ కు పొంచి ఉన్న ప్రమాదం

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
భద్రాద్రి, కొత్తగూడెం:ఈ అక్రమ ఇసుక లారీలన్నీ సీతారాం ప్రాజెక్టు నుంచి నాగారం మీదుగా మెయిన్ రోడ్డు ఎక్కి సుదూర ప్రాంతాలకు తరలిస్తారు.చెక్పోస్టుల్లో ఆర్టిఏ ల నిఘా నిన్నటితో ముగియటమే.. ఇసుక మాఫియా కు వరమైనట్టు అనిపిస్తుంది అంటున్న స్థానిక ప్రజలు.ఇందు లేడందు సందేహము వలదు ఎందెందు వెతికినా అందందు గలడు ఆ మహానుభావుడు? అక్రమ ఇసుక రవాణా కు మండల అధికార యంత్రాంగం మొత్తం నా గుప్పెట్లోనే అంటున్న అక్రమ ఇసుక రవాణాకు ఎవరు ట్రాక్టర్ పెట్టిన నాకు టాక్స్ కట్టాల్సిందే లేకపోతే మీ ట్రాక్టర్ తిరగదు అంటూ బెదిరింపులకు గురి చేస్తున్న ఆ ఘనుడు ర్యాంపులో ఇసుక మాఫియా ఇష్టారాజ్యం బూర్గంపాడు మండలంలో పాత పినపాక  ర్యాంపు వద్ద ఇసుక మాఫియా బీభత్సం సృష్టిస్తోంది.ప్రతి రోజు పదుల సంఖ్యలో లారీలు లోడింగ్ ట్రాక్టర్స్ అక్రమంగా ఒక్క ట్రిప్ కి 200 వసూలు చేస్తున్న నాగారం, మోరంపల్లి బంజర గ్రామాలకు చెందిన వారే సూత్రదారులు, పాత్ర దారుడు.అధిక లోడుతో ఉన్న లారీలను నాగారం మీదుగా సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ దారి వెంబడి హైవే ఎక్కిస్తున్న ఇసుక మాఫియా.ఇదే అదునుగా భావించిన మాఫియా అక్రమ తొలకాలు జరిపి స్టాక్ పెట్టి లారీలకు లోడింగ్ జరుపుతూ లక్షల రూపాయలు గండి కొడుతున్నారు ప్రభుత్వ ఆదాయానికి.మూడు బ్యాచులుగా విభజించి ఇసుక రవాణా నిర్వహిస్తూ అధికారుల కళ్లముందే బహిరంగంగా దోపిడీ కొనసాగిస్తున్నా వైనం.ట్రాక్టార్లతో డంప్ చేసి లారీలకు లోడ్ చేసి సుదూర ప్రాంతాలకు తరలిస్తున్న ఇసుక మాఫియా ఒక లారీ ఇసుక వచ్చి సుమారు 30 నుంచి 35000 వేలు వసూలు చేస్తున్న ఆ గనులు.స్థానికులు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్రమ ఇసుక మాఫియాపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు…

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -