Friday, April 3, 2026

షాదీ ముబారక్ చెక్కు పంపిణీ చేసిన కార్పోరేటర్ కన్నం వైష్ణవి

- Advertisment -

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
ఖమ్మం: గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరావు ఆదేశానుసారం స్థానిక 46వ డివిజన్ పరిధిలోని సారధి నగర్ లో లబ్ధిదారైన షేక్ కౌసర్ బేగంకు షాదీ ముబారక్ చెక్కును కార్పోరేటర్ కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణ వారి ఇంటికి వెళ్లి అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడపిల్లల పెళ్లి సందర్భంలో వారి తల్లిదండ్రులకు ఆర్థిక సహాయార్థం షాదీ ముబారక్ చెక్కును మంజూరు చేయించడం జరిగిందని పేద ప్రజలకు సాయం అందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని వారు తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఖమ్మం నియోజకవర్గం లో ప్రజా సంక్షేమానికి తుమ్మల నాగేశ్వర రావు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణ, డివిజన్ అధ్యక్షుడు షేక్ రజ్జి, మాజీ కౌన్సిలర్ సింగం అంజయ్య, నగర ఓబిసి సెల్ అధ్యక్షుడు బాణాల లక్ష్మణ్, నాయకులు దయ్యాల నాగేశ్వరరావు, ఎమ్మే రామకృష్ణ, ఓబిసి అధ్యక్షుడు తుపాకుల మధు, గుంటుపల్లి పద్మ , జిపిఓలు షేక్ హైమద్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -