Friday, April 3, 2026

పత్తి, మొక్కజొన్న , ధాన్యం కొనుగోలుకేంద్రాలుప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

- Advertisment -

పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద గారు.

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
నర్సంపేట నియోజకవర్గంలోని నెక్కొండ , నర్సంపేట మార్కెట్ యార్డుల్లో నేడు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద గారితో కలిసి పత్తి, మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు వారు కోరుకున్న రోజే స్లాట్ బుకింగ్ చేసుకొని పత్తి తీసుకువస్తే కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అదే విధంగా ధ్యానం , మొక్కజొన్న రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయవద్దని అధికారులను , వ్యాపారులను ఆదేశించారు.రైతులు కూడా తేమ శాతం ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉండేలా చూసుకొని తీసుకురావాలని కోరారు .కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్డీఓ రాంరెడ్డి,ఆర్డీవో ఉమారాణి , డీసీఓ నీరజ , డీఎం సివిల్ సప్లయర్ సంధ్యారాణి , డీసీఎస్ఓ కిష్టయ్య, మార్కెట్ ఛైర్మన్లు పాలాయి శ్రీనివాస్, హరీశ్ రెడ్డి, పీసీసీ మెంబర్లు రంజిత్ రెడ్డి, రామానంద్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి నాయకులు , కార్యకర్తలు.తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -