నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం BRS పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు రేగ కాంతారావు జిల్లాకు జరుగుతున్న నష్టాన్ని ప్రశ్నిస్తూ, ప్రజల పక్షాన పోరాడుతుంటే తట్టుకోలేక కాంగ్రెస్ గుండాలు పార్టీ కార్యాలయంపై దాడి చేశారని.ప్రశాంతంగా ఉన్న జిల్లాను బ్రస్టు పట్టించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుందని.రాష్ట్రంలో అరాచక పరిపాలన నడుస్తుందని.గత 10సం.లో ఎప్పుడు ఇలాంటి నీచ పరిస్థితులు చూడలేదని కానీ కాంగ్రెస్ గద్దెనెక్కిన 2సం.లోనే రాష్ట్రం మొత్తం రౌడీ రాజ్యం నడుపుతుందని.సామాన్య ప్రజలు సైతం భయపడే పరిస్థితి నెలకొందని.దాడి జరిగే సమయంలో BRS నాయకులు లేదా కార్యకర్తలు ఉండి ఉంటే వారిని హత్య చేసేవారని.ఈ దాడికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేకపోతే వెంటనే దాడికి పాల్పడిన వారినీ అరెస్ట్ చేసి కేసు నమోదు చెయ్యాలని డిమాండ్ చేస్తూ.ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
BRS పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని తీవ్రంగా ఖండించిన మాజీ MLA మెచ్చా
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

