Friday, April 3, 2026

కోదాడ తహసిల్దార్ కువినతి పత్రం అందజేస్తున్న బహుజన నాయకులు.

- Advertisment -

బీసీ రిజర్వేషన్ బిల్లులు 9 వ షెడ్యూల్లో చేర్చాలి

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
కోదాడ :రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిల్ నెంబర్ 3 మరియు 4 ద్వారా విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చేసిన బిల్లులను తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బహుజన వేదిక రాష్ట్ర కన్వీనర్ కస్తూరి రాములు కోదాడ తహసిల్దార్ వాజిద్ అలీకు వినతి పత్రం అందజేశారు. 42 శాతం రిజర్వేషన్లో ఉప వర్గీకరణ చేసి, అత్యంత వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం జరిగేలా జరిగేలా చూడాలన్నారు. రాష్ట్రంలోనే అన్ని నామినేటెడ్ పోస్టులు, కమిషన్లు, బోర్డులు, సలహా మండల్లో 90 శాతం బిసి ఎస్సి, ఎస్టి లకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, తగు ప్రాతినిధ్యం, రాజ్యాంగ స్పూర్తికి అనుగుణమని గట్టిగా నమ్ముతున్నట్లు అభిప్రాయపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రభుత్వము బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటుచేసి 20వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించినా, ఆచరణలో బహు కొద్ది మాత్రమే ఖర్చు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో బిసి, బహుజన నాయకులు పొట్ట జగన్మోహన్రావు, బొడ్డు వీరయ్య, తమ్మనబోయిన వీరబాబు, సారగండ్ల సత్తయ్య ,ఆర్ రామ నరసయ్య ,వరకాల జానయ్య, వేముల కోటయ్య ,గుండ్లపల్లి రంగారావు ,గడ్డం నరసయ్య, తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -