Friday, April 3, 2026

మొందా తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఈనెల 13న ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగే నిరసన ప్రదర్శన ధర్నాను విజయవంతం చేయండి

- Advertisment -


అఖిల భారత రైతు కూలి సంఘం ఏఐకేఎంఎస్ ఖమ్మం జిల్లా కార్యవర్గం డిమాండ్

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
అఖిల భారత రైతు సంఘం ఏఐకేఎంఎస్ ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం ది 5 11 2025 నా ఖమ్మం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కార్యాలయంలో కామ్రేడ్ బజ్జూరి వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి వై ప్రకాష్ మాట్లాడుతూ ఈ సంవత్సరం జిల్లాలో రైతాంగం ఎంతో ఆశతో లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టి పత్తి వరి మిర్చి మొక్కజొన్నఇతర పంటలను వేలాది ఎకరాలలో సాగు చేయటం జరిగిందని ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుండి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాల మూలంగా సకాలంలో వ్యవసాయానికి అందవలసిన ఎరువులు యూరియా అందించలేక పోయిందని దీని మూలంగా పంట దిగుబడి అధికంగా తగ్గిపోయిందని ఎంతోకొంత పంటలు చేతికి వచ్చే సమయములో తుఫాన్లు ప్రకృతి వైపరీత్యాలు గత నెల చివర్లో మూడు రోజులు వచ్చిన మొంద తుఫాన్ మూలంగా అన్ని రకాల పంటలు పూర్తిగా దెబ్బతిని జిల్లా రైతాంగం తీవ్ర నష్టాలలో కోరుకుని పోయి పెట్టిన పెట్టుబడులు రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి నెట్టబడినారని దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలని ఇంత జరుగుతున్న జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా ఇంతవరకు అన్ని మండలాలలో పంటల నష్టం సర్వే సంపూర్ణంగా మొదలు పెట్టలేదని తుఫాన్ సహాయక చర్యలు చేపట్టలేదని పంటల నష్టం పరిహారం ప్రకటించలేదని దీనికి నిరసనగా అఖిలభారత రైతు కూలి సంఘం ఏఐకేఎంఎస్ ఖమ్మం జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో ఈనెల 13న ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగే నిరసన ప్రదర్శన జరిగే కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు రైతు కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరినారు ఈ సమావేశంలో జిల్లా నాయకులు కే సురేష్ మాతంగి రామస్వామి పోలే పొంగు నాగయ్య శీలం సుదర్శన్ మురళీధర్ బడే టి అప్పారావు తదితరులు పాల్గొన్నారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -