కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం మరియు రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్మికులను కట్టు బానిసలుగా చేస్తున్నటువంటి చట్టాలను తీసుకొచ్చి పని గంటలు పెంచి కార్మికుల శ్రమను దోచుకుంటున్నటువంటి స్థితి నేడు దేశంలో కొనసాగుతున్నది కార్మికుల హక్కుల కోసం కార్మికుల చట్టాల కోసం కార్మికుల అవగాహన కోసం నవంబర్ 9న జరుగు రాజకీయ శిక్షణ తరగతులు ఎంతో ఉపయోగపడతాయని టియుసిఐ ఖమ్మం నగర అధ్యక్ష కార్యదర్శులు ములకలపల్లి లక్ష్మీనారాయణ కే శ్రీనివాస్ అన్నారు
నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్ లో హమాలీల తో జనరల్ బాడీ నిర్వహించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ భారత కార్మిక పోరాటాలు మరియు జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు అనే క్లాసులను ఎస్ఎల్ పద్మ కె సూర్య బోధిస్తారు అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మికులు చైతన్యవంతం చేయడానికి ఈ క్లాసులు ఎంతగానోఉపయోగపడతాయని ఈ క్లాసులు బోధించడానికి టి యు సి ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్ఎల్ పద్మ మరియు పి సూర్య పాల్గొని క్లాసులు బోధిస్తారని కార్మికుల చైతన్యం చేయడానికి ఉపయోగపడే ఈ క్లాసులకు కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో టియుసిఐ నగర నాయకులు శ్రీనివాసు రమేష్ మేస్త్రిలు ఏ సైదులు ఎస్.కె సైదులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు

