Friday, April 3, 2026

అమరవీరుల ఆశయ సాధన కోసం ప్రజా యుద్ధపం దా మార్గంలో కొనసాగుదాంసిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర రాష్ట్ర నాయకులు కామ్రేడ్ ఆవు నూరి మదన్న గౌని ఐలన్న ల పిలుపు

- Advertisment -

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
ఖమ్మం:సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపులు భాగంగా ఈనెల నవంబర్ 1 నుండి 9 వరకు అమరవీరుల సంతాప సభల పిలుపులో భాగంగా రాత్రి ఏడు గంటలకు కారేపల్లి మండలం మాదారం గ్రామంలో అమరులైన కామ్రేడ్ షేక్ బిక్కుమీయా తుమ్మలపల్లి హనుమంతరావు లా సంతాప సభ మండల నాయకులు కామ్రేడ్ కుర్ర శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది
ముందుగా గ్రామంలో ప్రదర్శన నిర్వహించి పార్టీ సీనియర్ నాయకులు నాగయ్య పార్టీ స్తూపం పై జెండా ఆవిష్కరించడం జరిగింది అనంతరం జరిగిన సభలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ నాయకులు రాష్ట్ర నాయకులు కామ్రేడ్ ఆవు నూరిమదన్న గౌని ఐలన్నలు మాట్లాడుతూ భారత విప్లవోద్యమ చరిత్రలో భూమికోసం భుక్తి కోసం అసమానతలు లేని దోపిడీ పీడనలు లేని సమ సమాజ స్థాపన కోసం ఈ దేశ విముక్తి కోసం సాయుధ పోరాటమే ఏకైక మార్గమని నాటి తెలంగాణ సాయుధ పోరాటం శ్రీకాకుళం నక్సల్ బరిఅమరులు కామ్రేడ్ సండ్ర పుల్లారెడ్డి స్థాపించిన గోదావరి లోయ ప్రతిఘటన పోరాటంలో నాటినుండి నేటి వరకు కోటన్న బాటన్న దొరన్న రవన్న ఎల్లన్న లింగన్న కాచన పెళ్లి అమరవీరులు దాదాపు 15 వేల మంది వీరులు వీర వనితలు తమ అమూల్యమైన ప్రాణాలను తృణప్రాయంగా ప్రజల కోసం తృణప్రాయంగా అర్పించినారనిఅనేక నిర్బంధాలను దాడులను ఎన్కౌంటర్లను ఎదుర్కొని వారి నాయకత్వంలో అనేక విజయాలు సాధిస్తూ దాదాపు పది లక్షల ఎకరాల పోడు భూములను నరికించి భూమిలేని ఆదివాసి గిరిజన గిరిజన ఇతర పేద ప్రజలకు పంచిపెట్టి వాటి పట్టా హక్కు సాధించుకోవడం జరిగిందని అలాగే విద్యార్థి యువజన మహిళ కార్మిక రైతాంగ హక్కులకై అనేక పోరాటాలు కొనసాగిస్తుందనిఎన్నో త్యాగాలతో సాధించుకున్న వన్ ఆఫ్ సెవెంటీ వీసా చట్ట 2006 అటవీ హక్కుల చట్టాలను నిర్వీర్యం చేస్తూ 2022 నూతన అటవీ హక్కుల చట్టం నియమావళి పేరుతో మతోన్మాద బిజెపి మోడీ ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకువచ్చి సాధించుకున్న చట్టాలను నిర్వీర్యం చేసిందనిప్రభుత్వ రంగ పరిశ్రమలైన రైల్వేలు విమానయానం ఓడరేవులు సింగరేణి విశాఖ స్టీల్ ప్లాంట్ ఎల్ఐసి బ్యాంకులులాంటి సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు ఆధార అంబానీలకు కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టి అమ్మి వేసిందనిరైతాంగాన్ని నిర్వీర్యం చేసి మూడు నల్ల తీసుకువచ్చి44 కోడులుగా ఉన్న కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా మార్చి రైతాంగాన్ని కార్మికులను బజారున పడవేసిందని క గార్ పేరుతో అమాయక గిరిజన ఆదివాసి గ్రామాలపై గుడాలపై దాడులు చేసి ప్రజలను భయభ్రాంతులకు చిత్రహింసలకు గురిచేసి అక్కడి భూములను అందులో ఉన్న విలువైన 180 రకాల ఖనిజ సంపదను ప్రైవేటు వ్యక్తులకు తాకట్టు పెట్టిఅమ్మి వేసిందని 2026 మార్చి 30 వరకు దేశంలో నక్సలిజం లేకుండా చేస్తానని మోడీ అమిత్ షా కంకణం కట్టుకొని క్రూర రాక్షస నిర్బంధాన్ని కొనసాగిస్తూ ఎన్కౌంటర్ల పేరుతో దాదాపు 15 వందల మంది వీరులను అమాయక ఆదివాసులను ఎన్కౌంటర్ల పేరుతో హత్యకాండ చేసిందని మానవ హక్కులను విస్మరించి తీవ్ర రాక్షస నిర్బంధాన్ని కొనసాగిస్తుందని మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని
దీనికి వ్యతిరేకంగా ప్రజలు రైతులు కూలీలు కార్మికులు ప్రజాస్వామికవాదులు పోరాటాలలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ మండల కార్యదర్శి వై ప్రకాష్ కోయిల శ్రీనివాస్ కంచర్ల శ్రీనివాస్ రెడ్డి వై జానకి బి వీరు గడ్డ వెంకన్న కావేటి నాగేశ్వరరావు నరేష్ సురేష్ సతీష్ ఎర్రయ్య శివయ్య గురవయ్య గోవిందు అంజి అలం చంద్రయ్య బైరు మల్ల లక్ష్మయ్య తావూరియా నాగయ్య నరసింహారావు విష్ణు నారాయణ జితేందర్ రాంబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -