Friday, April 3, 2026

హామీలను విస్మరించి సంబరాలు సమంజసం కాదు అని, ఆరు గ్యారంటీలు పూర్తిగా అమలు కానిదే  సంబరాలు ఎలా జరుపుకుంటారనిసిపిఐ (ఎంఎల్)మాస్ లైన్  ఖమ్మం నగర కార్యదర్శి శోభ  తీవ్రవిమర్శించారు

- Advertisment -

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
ఖమ్మం నగరంలోని కైకొండేయ్య గూడెం గ్రామంలో పార్టీ సభ్యుల విస్తృత స్థాయి సమావేశం కామ్రేడ్ రామనాథం అధ్యక్షతన జరిగిన సమావేశంలో శోభ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలు చెయానిదే సంబరాలను జరుపుకునే నైతిక హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అన్నారు. మహిళలకు ఇచ్చే పెన్షన్స్ నాలుగు వేలు ఇస్తానని, ప్రతి మహిళకు 2000 ఉన్నారా ఇస్తానని హామీ ఇచ్చి ఇంకా నెరవేర్చలేదన్నారు. రుణమాఫీ అరకురా చేసి చేతులు దులుపుకున్నారన్నారు. రైతు భరోసాను ఇవ్వడంలో కాలయాపన చేసి ఎత్తేయడానికి పూనుకుంటున్నారన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. పోడు భూముల విషయంలో కెసిఆర్ నియంతృత్వ వైఖరిని అవలంబిస్తే తాను గెలిచాక పోడు భూముల పట్టాలు ఇస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చి అమలుకు పూనుకోకుండా తుంగలో తొక్కారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు నిర్వహించాలని పిలుపునివ్వడం సరైన విధానం కాదని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు మొదలవుతున్నప్పుడు ప్రజల్ని మాయాజాలంలో ముంచచడానికె హామీలు పూర్తిగా నెరవేరకుండా సంబరాలు నిర్వహించుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లుగా అర్థమవుతుందన్నారు. ఇప్పటికైనా సంబరాల కంటే హామీల అమలుపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. లేదంటే భవిష్యత్తులో కెసిఆర్ ప్రభుత్వానికి పట్టిన గతి పడుతుందని ఆయన హెచ్చరించారు.కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా నాయకురాలు సిహెచ్ శిరోమణి కే శ్రీనివాస్ నాయకులు లెనిన్ బి రమేష్ ధరణ్ కృష్ణ కొమురయ్య వెంకన్న రవి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -