నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
ఖమ్మం రవాణాశాఖ (RTA) కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్రమ ధన లావాదేవీలపై అందిన ఫిర్యాదుల నేపధ్యంలో ఆఫీసు ప్రాంగణాన్ని ఖచ్చితంగా సోదాలు చేశారు.దాడులలో ఏం జరిగిందంటే..కార్యాలయ ప్రాంగణంలో ఉన్న 15మంది ప్రైవేటు ఏజెంట్లు అదుపులో.ఏజెంట్ల వద్ద నుంచి రూ.70,000 నగదు స్వాధీనం.డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీ కార్డులు, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లు పట్టుబాటు..
ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, మరిన్ని పత్రాలు స్వాధీనం..కార్యాలయంలో పనిచేసే ప్రభుత్వ అధికారులను ప్రశ్నిస్తున్న ఏసీబీ టీమ్..
రవాణాశాఖలో జరిగే లావాదేవీలకు సంబంధించి లంచాల డిమాండ్ ఉంటుందన్న ఫిర్యాదులపై విచారణను వేగవంతం చేస్తున్నట్లు ఏసీబీ సమాచారం.ప్రజలకు హెచ్చరిక ఫిర్యాదు చేయండి
లంచం డిమాండ్ చేసే ఏ ప్రభుత్వ శాఖ అధికారులు ఉన్నా టోల్ ఫ్రీ నంబర్ 1064 కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ రమేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అవినీతి పై అవగాహన పెంచేందుకు డిసెంబర్ 3 నుంచి 9 వరకు అవినీతి నిరోధక వారోత్సవాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
రవాణాశాఖ కార్యాలయంలో (ACB) ఆకస్మిక దాడులు 70 వేల నగదు 15మంది ఏజెంట్లు అదుపులో..
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

