నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
ఖమ్మం జిల్లాలో భారీ సైబర్ క్రైమ్ కేసును పోలీసులు ఛేదించారు. అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లతో కలిసి పనిచేస్తూ దేశవ్యాప్తంగా ప్రజలను మోసం చేసిన ఆరుగురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ముఠా ఇప్పటివరకు దాదాపు రూ.547 కోట్లను కొల్లగొట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది.నిందితులు కాల్ సెంటర్లను నిర్వహిస్తూ మ్యాట్రిమోని వెబ్‌సైట్లు, రివార్డ్ పాయింట్లు, ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్, షేర్ మార్కెట్ పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పేరుతో అమాయకులను టార్గెట్ చేశారు. అధిక లాభాలు వస్తాయంటూ ఆకర్షణీయమైన ఆఫర్లు చూపి బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఈ సైబర్ మోసాలకు ఉపయోగించిన బ్యాంక్ ఖాతాలు అందించిన మరో 17 మందిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మోసపూరిత లావాదేవీలకు వందల సంఖ్యలో డమ్మీ ఖాతాలను వినియోగించి సొమ్మును వివిధ మార్గాల్లో విదేశాలకు తరలించినట్లు సమాచారం.కేసు దర్యాప్తులో భాగంగా కాల్ సెంటర్ల నుంచి కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, బ్యాంక్ డాక్యుమెంట్లు తదితర కీలక ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరికొందరు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోంది.సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్, లింకులు, అధిక లాభాలు ఆశ చూపే ఆఫర్లకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు.
ఖమ్మంలో రూ.547 కోట్ల సైబర్ మహా మోసం ఛేదింపు.. ఆరుగురు కేటుగాళ్లు అరెస్ట్
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

