నేటివారధి న్యూస్ (ప్రతినిధి)
నిజామాబాద్ జిల్లాలో గంజాయి తరలిస్తున్న ముఠా పోలీసులపై దాడికి పాల్పడింది. కారులో గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారం మేరకు విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ సౌమ్యా వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలో గంజాయి ముఠా సభ్యులు ఆగకుండా కానిస్టేబుల్ సౌమ్యాను కారుతో ఢీకొట్టి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో సౌమ్యాకు తీవ్ర గాయాలు కావడంతో సహచర పోలీసులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది.ఘటనపై అప్రమత్తమైన పోలీసులు గంజాయి ముఠాను వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి గంజాయి, వాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు..
గంజాయి ముఠా దాడి కారుతో కానిస్టేబుల్‌ను ఢీకొట్టి పరార్‌కు యత్నం
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

