ప్రముఖ సంఘ సేవకులు బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్
నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
సిద్దిపేట జిల్లా కోహిడ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటుచేసిన ఓపెన్ జిమ్ సెంటర్ సందర్శించిన ప్రముఖ సంఘ సేవకులు బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్ ఓపెన్ జిమ్ సెంటర్ వచ్చిన చిన్నారి బాలలతో ఆయన ముచ్చటిస్తూ చిన్నారి బాలులో చిన్నప్పటి నుండే వ్యాయామం చేయాలని ఆయన పేర్కొన్నారు ఆరోగ్యమే మహాభాగ్యము అని సూక్తిని చిన్నారి విద్యార్థులు ప్రతిరోజు వ్యాయామం చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాలని చిన్నారులతో అన్నారు వ్యాయామం ద్వారా ఆరోగ్యవంతంగా ఉంటామని చిన్నారులతో అన్నారు కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఏర్పాటు చేసిన జిమ్ సెంటర్ ను మీ స్నేహితులకు మీరు తప్పకుండా వ్యాయామం చేయాలని విద్యార్థులకు సూచన చేశారు మంచిగా చదివి తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని చిన్నారులతో అన్నారు చిన్నప్పటినుండి మంచి అలవాట్లను నేర్చుకోవాలని క్రమశిక్షణ జాతీయత దేశభక్తి మన సంస్కృతి సాంప్రదాయాలను పునికి పుచ్చుకోవాలని విద్యార్థులతో అన్నారు ఈ జిమ్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేసిన హుస్నాబాద్ శాసనసభ్యులు రాష్ట్ర రవాణా బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జగదీష్ చిన్నారి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

