Thursday, April 2, 2026

అంతర్రాష్ట్ర సైబర్ మోసగాళ్ల గ్యాంగ్ అరెస్ట్ నిందితుల్లో ఒకరు మైనర్.

- Advertisment -

1500 సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్స్, మదర్ బోర్డ్స్, బ్యాటరీస్ స్వాధీనం సైబర్ క్రైమ్ నేరాలకు పరోక్షంగా సహకరిస్తూ మోసాలు చేస్తున్న నిందితులు.జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో నలుగురిపై కేసు నమోదు సైబర్ క్రైమ్ పై ఉక్కు పాదం మోపుతూ, సైబర్ క్రైమ్ నేరాలను తగ్గించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం మరో అడుగు ముందుకు వేసిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. అంతరాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠా గ్యాంగ్ ను అరెస్టు చేయడం జరిగిందని, ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో వివరాలను వెల్లడించారు.ఆదివారం సాయంత్రం సుమారు 04.00 గంటల సమయంలో ఎన్‌టీఆర్ చౌక్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో నలుగురు సైబర్ మోసగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై అదే రోజు సాయంత్రం 06.30 గంటలకు జి. రమ్య, ఎస్ఐపీ, ఆదిలాబాద్ ఐ టౌన్ వారు ఫిర్యాదు నమోదు చేశారు.
అరెస్టైన నిందితులు:A-1: మొహమ్మద్ ఇర్ఫాన్(29), s/o ఎం.డి. షరీఫ్, నివాసం: ఇ-40, గలి నం.13, సుభాష్ విహార్, నార్త్ ఘోండా, గర్హీ మెండు, భజన్‌పురా, ఉత్తర ఈస్ట్ ఢిల్లీ జిల్లా.A-2: సాహిల్ (25), s/o అస్లాం మాలిక్, నివాసం: హౌస్ నం.109, గలి నం.2, జాకిర్ హుస్సేన్ కాలనీ, మీరట్ సిటీ, ఉత్తరప్రదేశ్.
A-3: అనాస్ (20), s/o నదీమ్ మాలిక్, చిరు వ్యాపారి.A-4 (సీసీఎల్): బాల నేరస్థుడు, వయస్సు (17), ఓల్డ్ సీమాపురి, జిల్మిల్, ఈస్ట్ ఢిల్లీ నిందితులుకొంతకాలంగా ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజల వద్ద నుండి పాత మొబైల్ ఫోన్లను తక్కువ ధరలకు కొనుగోలు చేసి, వాటిలోని మదర్‌బోర్డులు, బ్యాటరీలు, సాకెట్లు వేరుచేసి ఇతర రిపేర్ చేసిన ఫోన్లలో అమర్చేవారు.
పాత మొబైల్ ఫోన్ల ద్వారా కస్టమర్ల డేటా, ఐఎంఈఐ నంబర్లు సేకరించి బ్యాంకు అధికారులమని చెప్పి అమాయక ప్రజలను మోసం చేసి, ఓటీపీలు పొందుతూ వారి ఖాతాల నుండి డబ్బులు దోచుకునే సైబర్ మోసాలకు పాల్పడే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.మిగిలిన స్క్రాప్ మొబైల్ ఫోన్లను ఢిల్లీలో తెలియని వ్యక్తులకు విక్రయించి లాభాలు ఆర్జించేవారు. ఆదివారంన రెండు బ్యాగులు మరియు చిన్న కవర్లలో స్క్రాప్/పాత మొబైల్ ఫోన్లు (దాదాపుగా 1500) తీసుకుని ఆదిలాబాద్ బస్ స్టాండ్ వైపు వెళ్తుండగా, ఎన్‌టీఆర్ చౌక్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి పరస్పర సమాచారం పంచుకోవడానికి ఉపయోగించిన నాలుగు సెల్ ఫోన్లు, పాత మొబైల్ ఫోన్లు, మదర్‌బోర్డులు, బ్యాటరీలు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ముఖ్యంగా ప్రజలు తక్కువ ధరకు తమ మొబైల్ ఫోన్లను విక్రయిస్తూ మోసపోవడం జరుగుతుందని, పరోక్షంగా నేరాలలో తమ పాత్ర ఉండేలా జరుగుతుందని వాటి వల్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సూచించారు. ముఖ్యంగా ఈ సైబర్ నేరగాళ్లు ఇతర దేశాల నుండి మరియు ఇతర రాష్ట్రాల నుండి మీకు చెందిన మొబైల్ ఫోన్ల ద్వారా సైబర్ నేరాలు చేసే అవకాశాలు ఉన్నాయి. వాటిలో మీరు చిక్కుకునే ప్రమాదం ఉన్నందున, తెలియని వారికి మొబైల్ ఫోన్లను అమ్మ వద్దని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, వన్ టౌన్ సిఐ బి సునీల్ కుమార్, ఎస్సైలు నాగనాథ్, అశోక్, రమ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -