నేటి వారధి తెలుగుపత్రిక
(ప్రతినిధి)
ఖమ్మం టిటిడిసి ప్రాంగణంలో వెలుగుమట్ల భూదాన్ భూమి నిరాశ్రయులైన గుడిసేవాసులను పరామర్శించిన సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ నాయకులు అశోకు సి.వై. పుల్లయ్య, సిహె.చ్, శిరోమణి, టి. ఝాన్సీ, ఆవుల మంగతాయి, శోభ, కె. శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు భూదాన్ భూముల నిరాశ్రయులైన వారినుద్దేశించి మాట్లాడుతూ ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పేదలను నిరాశ్రయులను చేయడం దుర్మార్గం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే భూదాన్ భూముల పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చి ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వర్షం వస్తునటువంటి పరిస్థితుల్లో వారు నిరాశ్రయులుగా ఉన్నారని అటువంటి వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని తక్షణమే వాళ్ళకు ఇళ్ల స్థలాలు ఇచ్చి వారికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు .రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్తులో నిర్వాసితులని సమైక్యపరిచి అన్ని రాజకీయ పార్టీలతో కలుపుకొని ప్రజాస్వామ్య పద్దతిలో ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
భూదాన్ భూముల నిరాశ్రయులైన గుడిసేవాసులను పరమశించిన సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రభుత్వం చర్యలను ఖండించిన నేతలు
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

